"తుపాకీ" రీ రిలీజ్ డేట్ వచ్చేసింది..!

Pulgam Srinivas
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ కొన్ని సంవత్సరాల క్రితం ఏ ఆర్ మురగదాస్ దర్శకత్వంలో రూపొందిన తుపాకీ అనే స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా , ఈ సినిమాకి హరిజ్ జయరాజ్ సినిమాకు సంగీతం అందించాడు.
 

ఇకపోతే ఈ మూవీ మంచి అంచనాల నడుమ 2012 వ సంవత్సరం తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా విడుదల అయింది. ఈ మూవీ కి తమిళ్ తో పాటు తెలుగు భాషలో కూడా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి. ఇకపోతే ఈ సినిమాతోనే తెలుగు లో విజయ్ కి మంచి గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే ఆ సమయం లో అద్భుతమైన విజయం సాధించే బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షం కురిపించిన తుపాకీ మూవీ ని తిరిగి మళ్ళీ థియేటర్ లలో చేయబోతున్నారు.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ మూవీ ని జూన్ 21 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. కొన్ని రోజుల క్రితం విజయ్ హీరోగా రూపొందిన గిల్లి మూవీ ని రీ రిలీజ్ చేయగా అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్ లను ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టింది. మరి విజయ్ నటించిన తుపాకీ మూవీ రీ రిలీస్ లో భాగంగా ఏ స్థాయి కలెక్షన్ లను వసూలు చేస్తుందో , బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి ఇంపాక్ట్ ను చూపిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: