మరోసారి తనకు హిట్ ఇచ్చిన దర్శకుడితో సినిమా చేయనున్న నిఖిల్..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం మంచి గుర్తింపు కలిగిన నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో నిఖిల్ ఒకరు. ఈయన హ్యాపీ డేస్ మూవీ తో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఆ మూవీ తర్వాత ఈయనకు తెలుగు లో వరుస సినిమా అవకాశాలు రావడం జరిగింది. అందులో భాగంగా ఈయన హ్యాపీ డేస్ సినిమా తర్వాత నటించిన చాలా వరకు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. దానితో ఈయన క్రేజ్ కూడా చాలా వరకు తగ్గిపోయింది.

అలాంటి సమయం లోనే ఈ నటుడు సుదీర్ వర్మ దర్శకత్వంలో రూపొందిన స్వామి రారా అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో నిఖిల్ కు సుధీర్ వర్మ కు ఇద్దరికి కూడా అద్భుతమైన గుర్తింపు లభించింది. ఇక ఆ తర్వాత నిఖిల్ వరుస సినిమాలలో నటిస్తూ అందులో ఎన్నో విజయాలను అందుకొని ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న నటుడుగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే తనకు స్వామి రారా మూవీ తో అద్భుతమైన విజయాన్ని అందించిన సుధీర్ వర్మ దర్శకత్వం లో నిఖిల్ మరో మూవీ చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కొన్ని రోజుల క్రితమే సుదీర్ వర్మ , నిఖిల్ కి ఓ కథను వినిపించగా ...  ఆ కథ సూపర్ గా నచ్చడంతో నిఖిల్ వెంటనే ఈ దర్శకుడి సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు , అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరో కొన్ని రోజుల్లో రాబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక నిజం గానే ఈ కాంబోలో కనుక మూవీ సెట్ అయినట్లు అయితే ప్రేక్షకుల్లో ఈ కాంబో మూవీ పై భారీ అంచనాలు నెలకొనే అవకాశం చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: