విక్రమ్ ను ఫాలో అవుతున్న కమలహాసన్ !

Seetha Sailaja

టాప్ హీరోల సినిమాలలో హీరో ఎక్కువ సమయం స్క్రీన్ పై కనపడుతూ ఉంటాడు. స్క్రీన్ స్పేస్ విషయంలో తమ హీరోను తక్కువ చేసి చూపెడితే ఆహీరో అభిమానులు ఊరుకోరు. అయితే తమిళ దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఈ ఫార్మలాని పూర్తిగా కమలహాసన్ తో తీసిన విక్రమ్ మూవీలో మార్చి అందర్నీ ఆశ్చర్య పరిచిన విషయం తెలిసిందే.

విక్రమ్ మూవీలో కమలహాసన్ పాత్ర కేవలం 47 నిముషాలు మాత్రమే ఉంటుందని ఆమూవీ విడుదలయ్యేంతవరకు చాలామందికి తెలియదు. ఇప్పుడు అదే టెక్నిక్ దర్శకుడు శంకర్ ‘భారతీయుడు 2’ విషయంలో కమల్ పై అనుసరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈమూవీలో కీలక పాత్ర పోషించిన హీరో సిద్దార్థ్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని షాకింగ్ విషయాలు చెప్పాడు.

ఈమూవీలో సేతుపతి పాత్రను పోషిస్తున్న కమల్ ఇండియాకు వచ్చే క్రమంలో అతడిని కాపాడే ముఖ్యమైన ట్విస్ట్ కు సంబంధించిన సీన్ లో తన పాత్ర ఎంట్రీ ఉంటుందని ఈమూవీలో కమల్ పాత్ర కంటే తన పాత్ర ఎక్కువ సేపు స్క్రీన్ పై కనిపిస్తుందని అంటున్నాడు. అంతేకాదు ఈమూవీలో సిద్దార్థ్ రకుల్ ప్రీత్ సింగ్ ఎపిసోడ్ కాస్త సుదీర్ఘంగా ఉంటుందని టాక్. వచ్చేనెల జూలైలో విడుదల కాబోతున్న ఈమూవీలో అనిరుద్ స్వరపరిచిన పాటలు ఇప్పటికే రిలీజ్ అయినప్పటికీ ఆపాటల ట్యూన్స్ పెద్దగా జనానికి కనెక్ట్ కాకపోవడంతో ఈమూవీ ఫలితం పై కొందరికి సందేహాలు ఏర్పడుతున్నాయి.

1996లో వచ్చిన బ్లాక్ బష్టర్ మూవీ ‘భారతీయుడు’ కి కొనసాగింపుగా వస్తున్న ఈసీక్వెల్ పై అంచనాలు బాగానే ఉన్నప్పటికీ ప్రస్తుత తరం ప్రేక్షకుల అభిరుచులకు అనుగుణంగా దర్శకుడు శంకర్ ఎంతవరకు ఈ సీక్వెల్ ను రూపోండిచాడు అన్న సందేహాలు మరికొందరిలో ఉన్నాయి. ఈ సంవత్సరం దర్శకుడు శంకర్ నుండి రెండు భారీ సినిమాలు ‘భారతీయుడు 2’ ‘గేమ్ ఛేంజర్’ వస్తున్న పరిస్థితులలో ఈ రెండు సినిమాల ఫలితం పై అతడి ఇమేజ్ ఆధారపడి ఉంటుంది..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: