మేలో కాలిపోయిన టాలీవుడ్.. ఒక్క హిట్ లేదు?

Purushottham Vinay
 మేలో టాలీవుడ్ లో ఒకదాని తరవాత మరో ఫ్లాప్‌ వస్తూ మే మొత్తం నష్టమే అన్నట్టు తయారైంది వ్యవహారం.ఈ నెలలో ఎక్కువ  సినిమాలొచ్చాయి. కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా హిట్ కాక నిర్మాతలకు సంతృప్తి ఇవ్వలేదు. మే 3న ఏకంగా 7 సినిమాలు విడుదల అయ్యాయి. వీటిలో ఆ ఒక్కటీ అడక్కు, ప్రసన్న వదనం మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకొన్నాయి. కానీ ఇవి రెండూ ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. మే 10న రిలీజ్ అయిన ప్రతినిధి, కృష్ణమ్మ కూడా బాగా నిరాశ పరిచాయి. వీటికి కనీసం ప్రారంభ వసూళ్లు కూడా రాలేదు. ఎన్నికలు అయ్యాక బాక్సాఫీసు దగ్గర జోష్ మొదలవుతుందనుకొన్నారు. కానీ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. కొన్ని చోట్ల అయితే ఏకంగా సింగిల్ స్క్రీన్లు మూసేశారు. మంచి సినిమాలు విడుదలైన తరవాతే.. థియేటర్లు ఓపెన్ చేస్తామని థియేటర్ యజమానులు స్వచ్ఛందంగా  నిర్ణయం తీసుకున్నారు.


దాంతో మే 17న కావల్సిన కొన్ని మూవీస్ వాయిదా పడ్డాయి. కొంతమంది నిర్మాతలు అయితే ధైర్యం చేసి సినిమాలు వదిలారు. కానీ ఎలాంటి ఫలితం రాలేదు. రాజు యాదవ్‌, లవ్ మి.. ఇలా వరుస ఫ్లాపుల పడ్డాయి.ఇక మే 31న ఏకంగా మూడు సినిమాలొస్తే.. ఒక్కటంటే ఒక్కటి కూడా సరిగ్గా ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయింది. యంగ్ హీరో విశ్వక్‌సేన్ నటించిన 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' నెగిటివ్ రివ్యూలు మూటగట్టుకొంది. దీనితో పోలిస్తే 'గం గం గణేశా', 'భజే వాయు వేగం' సినిమాలే బెటర్‌. కానీ వసూళ్లు మూడింటికీ కూడ డల్ గానే ఉన్నాయి. వీకెండ్ లో ఏమైనా కొన్ని టికెట్లు తెగితే.. అది విశ్వక్ సినిమాకే తెగుతాయి. మొత్తానికి ఈ నెలలో ఒక్కటంటే ఒక్క హిట్ కూడా పడలేదనే చెప్పాలి. రాజకీయాలు ఇంకా ఐపీఎల్ ఇవి రెండూ థియేటర్లకు ప్రేక్షకుల్ని రానివ్వకుండా బాగా అడ్డుకొన్నాయి. కంటెంట్ ఉన్న సినిమాలూ కూడా రాలేదు. ఇక 'మే'.. కూడా నష్టమే మిగిలచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: