తీవ్ర నిరాశలో మహేష్ అభిమానులు !

Seetha Sailaja
సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజుకు మహేష్ సినిమాలకు విడదీయరాని అనుబంధం ఉంది. తన తండ్రి పుట్టినరోజునాడు మహేష్ నటించే సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కానీ టీజర్ ను కానీ అన్నీ కుదిరితే అతడి సినిమాల ప్రారంభోత్సవం కానీ విడుదలకానీ ఉండేలా గత కొన్ని సంవత్సరాలుగా మహేష్ ఒక సెంటిమెంట్ ను పాటిస్తూ వచ్చాడు.

దీనితో మే 31న మహేష్ రాజమౌళీల కాంబినేషన్ మూవీకి సంబందహించిన ఒక అప్ డేట్  ఉంటుందనీ మహేష్ అభిమానులు ఎంతగానో ఊహించుకున్నారు. అయితే రాజమౌళి మహేష్ తో తీయబోతున్న సినిమాకు సంబంధించి ఎటువంటి అప్ డేట్ లేకపోవడంతో మహేష్ అభిమానులతో పాటు సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు కూడ బాధ పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

అయితే అందుతున్న సమాచారం మేరకు రాజామౌళి మహేష్ సినిమా విషయమై ఇంకా మీడియా ముందుకు రాకపోవడానికి వేరే కారణాలు ఉన్నాయి అని అంటునన్నారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలోని అందరి దృష్టి జూన్ 4న జరగబోతున్న ఎన్నికల ఫలితాల పై ఉండటంతో ఇలాంటి సమయంలో మహేష్ రాజమౌళిల మూవీ ఫస్ట్ లుక్ గురించి పెద్దగా కొందరు పట్టించుకోకపోవచ్చనీ అన్న భావన రాజమౌళి తో పాటు  మహేష్ కు కూడ ఏర్పడక పోవడంతో చివరి నిముషంలో ఈమూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలను  వాయిదా వేశారు అన్న వార్తలు వస్తున్నాయి.

ఈ పరిస్థితులు ఇలా కొనసాగుతూ ఉండగా రాజమౌళి మహేష్ తో తీయవలసిన మూవీ స్క్రిప్ట్ పూర్తి కాక పోవడంతో పాటు ఈమూవీకి సంబంధించన ఫైనల్ ప్రకటన ఇంకా రాలేదు అని అంటున్నారు. దీనికితోడు ఈ సినిమాకు సంబందించిన నటీ నటుల ఎంపిక కూడ పూర్తికాక పోవడంతో ప్రస్తుతం జక్కన్న దృష్టి అంతా విదేశాలకు సంబంధించిన నటీ నటులను ఈమూవీ కథ రీత్యా ఎవరి పాత్రకు ఎవరు సరిపోతారు అన్న ఆలోచనలలో జక్కన్న పూర్తిగా కన్ఫ్యూజ్ అవుతున్న పరిస్థితులలో రాబోతున్న ఆగష్టులో జరిగే మహేష్ పుట్టినరోజునాడు ఈమూవీ ఫస్ట్ లుక్ విడుదల ఉంటుంది అని అంటున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: