రకుల్ ని చూసి ఆ పని చేస్తున్న తమన్నా.. షాక్ లో ఫ్యాన్స్?

praveen
సాధారణంగా ఎవరైనా ఒక పని చేసి సక్సెస్ అయ్యారు అంటే ఆ పని మనమెందుకు చేయకూడదు అని మిగతావారు అనుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే కుదిరితే ఆ పనిని తమదైన స్టైల్ లో చేసి సక్సెస్ అవడం చూస్తూ ఉంటాం  అయితే కేవలం కామన్ పీపుల్ మాత్రమే కాదు.. సినీ సెలబ్రిటీలు కూడా తమ సహనటులు చేసి సక్సెస్ అయిన పనులను ఇక ఫాలో అవ్వడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న మిల్కీ బ్యూటీ తమన్న కూడా ఇలాగే ఒక హీరోయిని ఫాలో అవ్వబోతుందట.

 తన తోటి హీరోయిన్ అయినా రకుల్ ప్రీత్ సింగ్ చేసిన పనిని ఇక ఇప్పుడు తమన్నా చేసేందుకు కూడా సిద్ధమవుతుందట. అయితే ఈ విషయం తెలుసుకుని అభిమానులు అందరూ కూడా షాక్ అవుతున్నారు అని చెప్పాలి. ఎందుకంటే తమన్నాకి కాస్త బిజినెస్ నాలెడ్జ్ తక్కువగా ఉంటుంది. అందుకే బిజినెస్ రంగంలో రాణించగలరా లేదా అని అభిమానులు ఆందోళన చెందుతున్నారట. అయితే ఈ మధ్య పెళ్లి చేసుకున్న స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఇక పెళ్లి తర్వాత బిజినెస్ లో ముందుకు సాగుతోంది  ఒక రకంగా వ్యాపారంలో కూడా సక్సెస్ అవుతుంది రకుల్  అయితే ఇక తన ఫ్రెండ్ రకుల్ చేసిన పనిని ఇప్పుడు తమన్న చేయబోతుందట.

 పలు కంపెనీలలో పెట్టుబడులు పెట్టడమే కాకుండా సొంతంగా కూడా కొన్ని వ్యాపారాలు ప్రారంభించాలని తమన్న అనుకుంటుందట. ఫుడ్ బిజినెస్, జిమ్ బిజినెస్ తో పాటు ఇక పలు రంగాలలో కూడా పెట్టుబడులు పెట్టేందుకు రెడీ అవుతుందట తమన్న. ఇక దీనికోసం పలువురు నిపుణుల హెల్ప్ కూడా తీసుకుంటుంది అన్నది తెలుస్తుంది. అయితే తమన్నా త్వరలోనే బాలీవుడ్ నటుడు విజయవర్మను పెళ్లి చేసుకోబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఇద్దరు కూడా డీప్ లవ్ లో మునిగి తేలుతూ ఉన్నారు అన్న విషయం తెలిసిందే. ఇక పెళ్లి తర్వాత ఎలాగో ఆఫర్స్ తగ్గుతాయి కాబట్టి ఇలా వ్యాపారంపై దృష్టి పెట్టిందట తమన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: