ఆ ముగ్గురు అక్కచెల్లెళ్లతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో మెగాస్టార్..!!

murali krishna
ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత తమకంటూ గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ హీరోయిన్స్ లో నగ్మా ఒకరు. ఒకప్పుడు తన నటన అందం అభినయంతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఏంది బే ఎట్టాగా ఉంది వాళ్ళు అంటూ అందరిని ఒక ఊపు ఊపేసింది. ఇప్పుడు సీనియర్ హీరోయిన్స్ పర్సనల్ లైఫ్ గురించి చర్చించుకుందాం.ఇప్పుడే కాదు.. ఒకప్పుడు కూడా హీరోయిన్స్ ఒకరు స్టార్ గా ఎదిగాకా.. వారి కుటుంబంలో మరొకరిని ఇండస్ట్రీకి పరిచయం చేసేవారు. చెల్లి, మేనకోడలు..అక్క కూతురు ఈ బంధాలే ఎక్కువగా కనిపించాయి. ఇంకా అలా ఇండస్ట్రీని ఏలిన అక్కాచెల్లెళ్ల లిస్ట్ లో సీనియర్ హీరోయిన్ నగ్మా సిస్టర్స్ కూడా ఉన్నారు. ఏంటి నగ్మాకు సిస్టర్ ఉందా.. ? అంటే ఒకరు కాదు ఇద్దరు ఉన్నారు. అందులో రెండో చెల్లి అందరికి సుపరిచితమే. ఒక స్టార్ హీరో భార్య కూడా.. ఆమె జ్యోతిక.
నగ్మా మొట్ట మొదటిగా ఇండస్ట్రీకి పరిచయమైంది. తన అందచందాలతో కుర్రకారును మెప్పించి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ గా వెలుగొందింది. తెలుగు, తమిళ్, హిందీ అని తేడా లేకుండా అప్పట్లో నగ్మా సృష్టించిన సంచలనాలు ఒకటి అని చెప్పలేము. ఇక అక్క బాటలోనే చెల్లెలు కూడా ఇండస్ట్రీ బాట పట్టారు. అయితే మొదటి చెల్లి జ్యోతిక కంటే.. రెండో చెల్లి రోషిణి ముందు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తరువాత జ్యోతిక ఎంట్రీ ఇచ్చింది.ప్రస్తుతం ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు ఎవరి కెరీర్ లో వారు బిజీగా మారిపోయారు. నగ్మా రాజకీయాల్లో బిజీగా ఉండగా.. జ్యోతిక ఒకపక్క హీరోయిన్ గా ఇంకోపక్క నిర్మాతగా కొనసాగుతోంది. ఇక రోషిణి పెళ్లి చేసుకొని గృహిణిగా సెటిల్ అయ్యింది. వీరి ముగ్గురులో కామన్ గా ఉన్న పాయింట్స్ లో ఒకటి.. ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళతో నటించిన ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే. అప్పట్లో చిరు- నగ్మా.. హాట్ పెయిర్ గా పేరు తెచ్చుకున్నారు. ఘరానా మొగుడు, రిక్షావోడు, ముగ్గురు మొనగాళ్లు లాంటి సినిమాలు వీరిద్దరికి బిగ్గెస్ట్ హిస్ తెచ్చిపెట్టాయి.
ఇక చిరు.. నగ్మా తరువాత ఆమె చెల్లి రోషిణితో రొమాన్స్ చేశాడు. రోషిణిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన హీరో చిరు. 1997 లో మాస్టర్ సినిమాతో రోషిణి తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఇందులో మొదటి హీరోయిన్ గా ఆమె నటించింది. ఈ సినిమా రోషిణికి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక వీరిద్దరూ కాకుండా చిరు.. నగ్మా రెండో చెల్లి జ్యోతికతో కూడా రొమాన్స్ చేసాడు. 2003లో ఠాగూర్ సినిమాలో చిరు సరసన జ్యోతిక నటించి మెప్పించింది. ఇలా ఈ ముగ్గురు అక్కచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరోగా చిరు గుర్తింపు పొందాడు. తాజాగా ఈ అక్కాచెల్లెళ్ల అరుదైన ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: