బెంగళూరు రేవ్ పార్టీ కేసులో తన పేరును అలా మార్చి చెప్పిన హేమ..?

Pulgam Srinivas
బర్త్ డే పార్టీ ముసుగులో బెంగుళూరు సిటీలో ఒక వ్యక్తి ఓ భారీ రేవ్ పార్టీని నిర్వహించగా దాని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి వెళ్లి అనేక మందిని అరెస్టు చేశారు. అలా అరెస్ట్ అయిన వ్యక్తులలో తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొంత మంది నటీ నటులు కూడా ఉండడంతో ఈ వార్త రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద కల కలం రేపింది. దానితో ఉదయం నుండి బెంగళూరు సిటీలో జరిగిన రేవ్ పార్టీలో తెలుగు ప్రముఖ నటులు అనే వార్తలు టీవీ లో , సోషల్ మీడియాలో మారుమోగాయి.

అందులో నటి హేమ కూడా ఉంది అని వార్తలు వచ్చాయి. అలా వార్తలు వస్తున్న సమయం లోనే నేను ఏ రేవ్ పార్టీకి వెళ్లలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లోనే ఉన్నాను. ఆ వార్తలు అన్ని అవాస్తవం అని ఆమె కొట్టిపారేస్తూ ఓ వీడియోని విడుదల చేసింది. ఇక ఆ వీడియో వచ్చిన తర్వాత బెంగుళూరు పోలీసులు ప్రస్తుతం ఆమె మా కస్టడీ లోనే ఉంది. మా కళ్ళు కప్పి ఆ వీడియోను రికార్డ్ చేసి విడుదల చేసింది అని వారు చెప్పారు.

అలాగే ఒక ఫోటోను కూడా విడుదల చేశారు. ఇక తాజాగా బెంగుళూరు పార్టీలో పట్టుబడ్డ అందరి బ్లడ్ శాంపిల్స్ ను తీసుకున్నారు. వారందరికీ టెస్టు చేయగా అందులో చాలామందికి పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇక  హేమా కు కూడా ఈ బ్లడ్ శాంపిల్స్ లో పాజిటివ్ గా వచ్చినట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే హేమ బెంగుళూరు పోలీసులను బోల్తా కొట్టియ్యడానికి తన పేరును మార్చి చెప్పినట్లు తెలుస్తోంది.

ఈమె పోలీసులకు దొరికినప్పుడు తన పేరును హేమ గా కాకుండా కృష్ణవేణి అని చెప్పినట్లు , దానితో వారు కూడా అలాగే ఆమె పేరున రిజిస్టర్ చేసుకున్నట్లు దాని వల్ల మొదటి నుండి కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడినట్లు కూడా తెలుస్తుంది. ఇలా బెంగళూరు పోలీసులకు దొరికిన సమయంలో హేమ తన పేరును మార్చి కృష్ణవేణి గా చెప్పినట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: