" పుష్ప 2 " రెండో సాంగ్ కి సర్వం సిద్ధం.. ఈ మెలోడీ అప్డేట్ ఎప్పుడంటే..!

lakhmi saranya
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 నుంచి రెండో పాట రిలీజ్ కి రెడీ అయింది. పుష్ప పుష్ప అంటూ ఈనెల మొదట్లో వచ్చిన మాస్ బీట్ సాంగ్ అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ పాట జోష్ జోరుగా ఉంది. ఈ క్రమంలోనే రెండో పాట కూడా రిలీజ్ చేసేందుకు పుష్ప మేకర్స్ రెడీ అవుతున్నారు.

ఈ చిత్రంలో రెండో పాటపై అప్డేట్ ఇచ్చేందుకు టైంని ఖరారు చేశారు మూవీ టీం. పుష్ప 2 ది రూల్ సినిమా నుంచి రెండో పాట అప్డేట్ రేపు అనగా మే 22 ఉదయం 11 గంటల 7 నిమిషాలకు విడుదల కానుంది. ఈ విషయాన్ని ఈ మూవీని నిర్మిస్తున్న movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ నేడు అనగా మే 21న వెల్లడించారు. రెండు వేళ్ళను చూపిస్తున్న ఎమోజిని ట్వీట్ చేశారు. రేపు 11:07 గంటలకు అంటూ పోస్ట్ చేశారు. ఇక ఈ రెండో పాటకు సంబంధించిన ప్రోమో రేపు రిలీజ్ చేయనున్నారు.

దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. పుష్ప టు నుంచి రాబోయే రెండవ మెలోడీ సాంగ్ కోసం ఫాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సాంగ్ ఏ విధంగా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ భారీ ప్రాజెక్టులో అల్లు అర్జున్ కి జోడిగా రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న ఈ సినిమా నీ movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. ఇక ఈ మూవీ పై అల్లు అర్జున్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఇక ఈ సినిమా కనుక సూపర్ హిట్ అయితే అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరుగుతుందని చెప్పుకోవచ్చు. పుష్ప మూవీతో ఓవర్ నైట్ లో పాణ్యం స్టార్ అయిన అల్లు అర్జున్ పుష్ప 2 తో ఇంకెంత పాపులారిటీని సంపాదించుకుంటాడు వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: