సూపర్ స్టార్ మహేష్ ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే సూపర్ సాలిడ్ బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించాడు. అలా మహేష్ నటించిన అదిరిపోయే రేంజ్
బ్లాక్ బస్టర్ మూవీ లలో
పోకిరి సినిమా ఒకటి. ఈ
మూవీ 2006 వ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన విడుదల అయింది. ఇక ఈ సినిమాలో మహేష్ బాబు హీరోగా నటించడం , ఆ సమయం లో
టాలీవుడ్ టాప్
డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి
పూరి జగన్నాథ్
మూవీ కి దర్శకత్వం వహించడంతో ఈ
మూవీ పై మొదటి నుండి ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ
సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ డే ఫస్ట్ షో కే
బ్లాక్ బస్టర్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ
మూవీ అదిరిపోయే రేంజ్ కలెక్షన్ లను వసూలు చేసి అప్పటి వరకు ఏ తెలుగు
సినిమా కూడా వసూలు చేయని కలెక్షన్ లను రాబట్టి
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ
మూవీ తో ఇటు మహేష్ , అటూ
పూరి జగన్నాథ్ క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇక ఈ
మూవీ లో
గోవా బ్యూటీ
ఇలియానా , మహేష్ కి జోడిగా నటించగా ,
ప్రకాష్ రాజ్ ఇందులో విలన్ పాత్రలో నటించాడు. నాజర్ ఈ
మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించగా ... మెలోడీ బ్రహ్మ మని శర్మ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఈయన ఈ సినిమాకు అందించిన సంగీతం కూడా ఈ
మూవీ విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది. ఇక ఈ
మూవీ లోని మహేష్ డైలాగ్ డెలివరీ కి , డ్రెస్సింగ్ స్టైల్ కి ఆ సమయంలో ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇకపోతే2006 వ సంవత్సరం విడుదల అయ్యి
టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన
పోకిరి సినిమా విడుదల అయ్యి నేటితో 18 ఏళ్లు పూర్తి అయింది. ఈ
సినిమా విడుదల అయ్యి 18 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికి కూడా ఈ
సినిమా బుల్లితెరపై ప్రసారం అయినప్పుడు మంచి "టి ఆర్" పి రేటింగ్ ను తెచ్చుకుంటుంది.