"సర్దార్ 2" కి సంబంధించిన క్రేజీ అప్డేట్..?

MADDIBOINA AJAY KUMAR
కోలీవుడ్ నటుడు కార్తీ తన కెరీర్ లో ఇప్పటి వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలలో హీరో గా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే . కార్తీ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన మూవీ లలో సర్దార్ మూవీ ఒకటి. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని రాసి కన్నా , రాజేష విజయన్ హీరోయిన్ లుగా నటించ గా , తమిళ సినీ పరిశ్రమ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకుడు అయినటువంటి పీ ఎస్ మిత్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . కొంత కాలం క్రితం విడుదల అయిన ఈ సినిమా అద్భుతమై న విజయాన్ని అందుకుంది.

ఈ సినిమా తెలుగు లో కూడా సర్దార్ అనే టైటిల్ తోనే విడుదల అయ్యి టాలీవుడ్ ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించిందు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత వెంటనే ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుంది అని అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీ సీక్వెల్ కి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ అవుతుంది.

ఈ మూవీ సీక్వెల్ కు సంబంధించిన ముహూర్తపు పనులను వచ్చే నెల చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సర్దార్ సినిమా "స్పై" యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందింది. ఇందులో కార్తీ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి రెండింటిలో కూడా తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో అలరించాడు. ఈ మూవీ లోని కార్తీక్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: