SSMB29: సింహంలా ఉన్న బాబు లుక్.. వైరల్?

Purushottham Vinay
టాలీవుడ్ టాప్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు- టాప్ డైరెక్టర్ దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతున్న విషయం అందరికి తెలిసిందే. ఈ సినిమా కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులు వేయికళ్లతో ఎంతగానో ఎదురుచూస్తున్నారు.అతి త్వరలోనే ఈ ప్రతిష్టాత్మక చిత్రం చాలా గ్రాండ్ గా పట్టాలెక్కనుంది. ఫారెస్ట్ అడ్వెంచర్ ఫిల్మ్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయింది.అయితే సినిమా గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అమెజాన్ ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో ఓ రేంజ్ యాక్షన్ సీక్వెన్స్ లతో రాజమౌళి - మహేష్ మూవీ ఉండనున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాకి మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జరుగుతున్నాయని ఇటీవల విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. పాన్ వరల్డ్ రేంజ్ లో ఈ మూవీని అడ్వాన్స్ టెక్నాలజీతో రాజమౌళి రూపొందించనున్నారని అనేక వార్తలు వస్తున్నాయి.ఈ సినిమా కోసం హీరోయిన్ తో పాటు చాలా పాత్రల కోసం హాలీవుడ్ యాక్టర్స్ ను తీసుకున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఇంకా అలాగే ఈ సినిమా కోసం సరికొత్తగా మహేష్ కనిపించబోతున్న విషయం తెలిసిందే. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో తళుక్కుమన్నారు.


రాజమౌళి, నిర్మాత కేఎల్ నారాయణతో కలిసి దుబాయ్ నుండి తిరిగి వస్తూ మహేష్ కనిపించారు. దీంతో మహేష్ బాబును చూడటానికి అభిమానులు, ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ప్రజలు బాగా ఎగబడ్డారు.అయితే వీరు ముగ్గురు కూడా SSMB 29 ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం దుబాయ్ వెళ్లినట్లు సమాచారం తెలుస్తోంది. ఇక మహేష్ బాబు లుక్ అయితే అదిరిపోయింది. సూపర్ స్టార్.. ఈ సినిమా కోసం తన లుక్ ను పూర్తిగా మార్చేశారు. గుబురు గడ్డంతో, జులపాల జుట్టుతో మెలితిప్పిన మీసంతో ఆయన లుక్ సింహం లాగా సర్ప్రైజింగ్ గా ఉంది. ప్రస్తుతం మహేష్ లుక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. సూపర్ స్టార్ చాలా డైనమిక్ గా ఉన్నారని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.హెయిర్ ఎక్కువగా ఉంది కనుక కనపడకుండా ఉండటానికి మహేష్ క్యాప్ పెట్టినట్లు చూస్తుంటే తెలుస్తోంది. అయితే సాధారణంగా సూపర్ స్టార్ మహేష్ ఎక్కువ హెయిర్, గడ్డంతో చాలా తక్కువగా కనిపిస్తారు. ఇప్పుడు మహేష్ లుక్ చూసి ఆయన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. సింహంలాగా ఉన్నడంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఈగర్లీ వెయిటింగ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇక ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: