దేవర మ్యానియాలో ఇండస్ట్రి !

Seetha Sailaja
జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘దేవర’ మూవీ షూటింగ్ ప్రారంభం నుండి ఆమూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. అక్టోబర్ 10న ‘దసరా’ పండుగను టార్గెట్ చేస్తూ విడుదల కాబోతున్న ఈమూవీ బిజినెస్ కు సంబంధించి బయటకు లీక్ అవుతున్న ఫిగర్స్ విని ఇండస్ట్రీ వర్గాలు షాక్ లో ఉన్నాయి.

ప్రస్తుతం ప్రచారంలో ఉన్న వార్తలు ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈమూవీ టోటల్ రైట్స్ ను 140 కోట్లకన్నా తక్కువ ఇచ్చే ప్రశక్తి లేదనీ ఈమూవీ నిర్మాతలు తెగేసి చెపుతున్నప్పటికీ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈమూవీ రైట్స్ కోసం దిల్ రాజ్ అదేవిధంగా మైత్రీ మూవీస్ సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత జూనియర్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ రేంజ్ లో ‘దేవర’ కు మ్యానియా ఏర్పడిందని అంటున్నారు. అయితే  తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ‘దేవర’ మూవీ మూడు వందల కోట్లకు పైగా కలక్షన్స్ వసూలు చేయగలిగినప్పుడు మాత్రమే ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతున్న ఈమూవీ బయ్యర్లు గట్టెక్కే అవకాశం ఉంది అంటున్నారు.

దీనికితోడు తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతికి సినిమాలు చూసినట్లుగా దసరా కు సినిమాలు చూడరు. ఈ పరిస్థితులలో ఏధైర్యంతో ‘దేవర’ కు 140 కోట్లను బయ్యర్లు ఆఫర్ చేసి ఉంటారు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రస్తుతానికి సమాధానంలేని ప్రశ్నగా మారింది. ఈమూవీలో తారక్ పక్కన జాన్వీ కపూర్ నటిస్తూ ఉండటంతో పాటు చాల రోజులు తరువాత జూనియర్ ఈ మూవీలో పూర్తి మాస్ లుక్ లో కనిపిస్తూ ఉండటంతో ఈమూవీకి టాక్ ఎలా వచ్చినప్పటికీ ఈమూవీ ఓపెనింగ్ కలక్షన్స్ దుమ్ము దులువుతాయి అన్న నమ్మకం కూడ ఈమూవీ బయ్యర్లకు ఏర్పడటంతో ఈమూవీకి ఈ రేంజ్ లో బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి అన్న అభిప్రాయాలు కూడ ఇండస్ట్రీలో వ్యక్తం అవుతున్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: