టీవీలోకి వచ్చేస్తున్న బ్లాక్ బస్టర్ మూవీ "హనుమాన్ "..!!

murali krishna
టాలీవుడ్ యంగ్ హీరో  తేజ సజ్జా నటించిన  సూపర్ హీరో మూవీ "హనుమాన్" ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ చిత్రం అంచనాలకు మించి కలెక్షన్ల ను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ   సూపర్ హీరో చిత్రం  విడుదలైన అన్ని భాషల్లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకొని అద్భుత విజయం సాధించింది. ఓటీటీ లో కూడా ఈ మూవీ అదరగొట్టింది. ఇదిలా ఉంటే హనుమాన్ మూవీ తెలుగు వెర్షన్ టీవీ లో ప్రసారయ్యేందుకు సిద్ధం అయింది.. ఈ మూవీ టెలికాస్ట్ డేట్ అండ్ టైం ఫిక్స్ అయ్యాయి..హనుమాన్ మూవీ జీ తెలుగు టీవీ ఛానెల్‍ లో ఏప్రిల్ 28 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు ప్రసారం కానుంది. ఈ విషయాన్ని జీ తెలుగు నేడు అధికారికంగా ప్రకటించింది. 

గత కొంత కాలంగా త్వరలో హనుమాన్ టెలికాస్ట్ కాబోతుంది అంటూ ఊరిస్తూ వచ్చిన జీ తెలుగు ఛానల్ ఎట్టకేలకు హనుమాన్ ను టెలికాస్ట్ చేస్తుంది."క్యాలెండర్ల లో డేట్ లాక్ చేసి పెట్టుకోండి. ఎపిక్ మూవీ హనుమాన్ వచ్చేస్తోంది. జీ తెలుగు లో ఏప్రిల్ 28 వ తేదీ సాయంత్రం 5:30 గంటలకు హనుమాన్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్" అని జీ తెలుగు నేడు ఎక్స్  లో ట్వీట్ చేసింది.ఇప్పటికే హనుమాన్ సినిమా హిందీ వెర్షన్.. కలర్స్ సినీ ప్లెక్స్‌ ఛానెల్‍ లో మార్చి 16 నుంచే ప్రసారం అవుతుంది.అలాగే హనుమాన్ హిందీ వెర్షన్ జియో సినిమా ఓటీటీ లో అందుబాటు లో ఉంది.అలాగే తమిళం,మలయాళం మరియు కన్నడ భాషల వెర్షన్లు డిస్నీ + హాట్‍స్టార్ ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి.థియేటర్స్, ఓటీటీ లో అదరగొట్టిన హనుమాన్ మూవీ టీవీ ప్రేక్షకులని కూడా ఆకట్టుకునేందుకు సిద్ధం అయింది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: