లేటెస్ట్ "ఓటిటి" రిలీజ్ మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
ప్రతి వారం లాగానే ఈ వారం కూడా చాలా సినిమాలు తెలుగు లాంగ్వేజ్ లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చాయి. అలా ఈ వారం డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సినిమాలు ఏవో తెలుసుకుందాం.
విశ్వక్ సేన్ హీరోగా విద్యాధర్ దర్శకత్వంలో రూపొందిన గామి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన విషయం మన అందరికీ తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించిన ఈ సినిమా ప్రస్తుతం "జీ 5" లో తెలుగు , తమిళ , కన్నడ భాషలలో స్ట్రీమింగ్ అవుతుంది. శ్రీ విష్ణు హీరోగా ప్రియదర్శి , రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలలో రూపొందిన ఓం భీమ్ బుష్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది.

తాజాగా ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో అందుబాటు లోకి వచ్చింది. కొన్ని రోజుల క్రితం మలయాళం లో విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన "ప్రేమలు" సినిమాని ఎస్ ఎస్ కార్తికేయ తెలుగులో విడుదల చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ మూవీ తాజాగా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

కాజల్ కార్తిక అనే సినిమా తాజాగా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో తెలుగు భాషలో అందుబాటు లోకి వచ్చింది. ఇందులో కాజల్ అగర్వాల్ ఓ ముఖ్యమైన పాత్రలో నటించింది. రెబల్ అనే సినిమా తాజాగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళ్ , తెలుగు , కన్నడ  భాషలో అందుబాటులోకి వచ్చింది. అమర్ సింగ్ చంకీల అనే సినిమా తాజాగా హిందీ , తెలుగు , తమిళ భాషల్లో నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చింది. ఇలా ఈవారం తెలుగు భాషలో అనేక సినిమాలు "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి అందుబాటులోకి వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ott

సంబంధిత వార్తలు: