టిల్లు క్యూబ్: ఈసారి ఆ పప్పులు ఉడకవు?

Purushottham Vinay
డీజే టిల్లు మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సిద్ధు జొన్నలగడ్డ చిన్న హీరో నుంచి స్టార్ హీరోగా మారాడు.డీజే టిల్లుతో సోషల్ మీడియాలో లైట్ లోకి వచ్చిన సిద్ధు జొన్నలగడ్డ ఆ సినిమా సీక్వల్ టిల్లు స్క్వేర్ తో ఏకంగా 100 కోట్ల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సర్ ప్రైజ్ చేశాడు. ముందు నుంచి టిల్లు స్క్వేర్ సినిమా పై ఉన్న అంచనాలకు తగినట్టుగానే సినిమా ఉండటంతో ఈ సినిమా చాలా ఈజీగా 100 కోట్లు వసూళ్లను రాబట్టింది.అయితే టిల్లు స్క్వేర్ 100 కోట్లు తెచ్చినా కూడా డీజే టిల్లు రేంజ్ కామెడీ ఇంకా ఎంటర్టైన్మెంట్ లేదన్న మాట కొందరి నోట వినిపించింది. సిద్ధు టిల్లు పాత్రలో రఫ్ఫాడించాడని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు కానీ రెండు సినిమాలని కంపేర్ చేసి చూస్తే మాత్రం ఎక్కడో డీజే టిల్లు లో ఉన్న మ్యాజిక్ టిల్లు స్క్వేర్ లో లేదని అనిపించింది. అయితే టిల్లు స్క్వేర్ లో అనుపమ గ్లామర్ కూడా స్ట్రాంగ్ హైలెట్ అని చెప్పొచ్చు. ఈ మూవీలో అనుపమ రెచ్చిపోయి మరీ బోల్డ్ సీన్స్ లో నటించడం ఆడియన్స్ కి కొత్తగా అనిపించింది.


 ఆల్రెడీ రౌడీ బాయ్స్ లోనే లిప్ లాక్ సీన్స్ లో నటించిన అనుపమ టిల్లు స్క్వేర్ లో అయితే ఇంకా డోస్ పెంచి మరీ స్కిన్ షో కూడా చేసింది. ఇవన్నీ యూత్ కి కనెక్ట్ అవ్వడంతో పైగా ఈ సినిమాకి పోటీగా ఏ తెలుగు సినిమా పెద్దగా ఆడకపోవడంతో భారీ వసూళ్లు నమోదయ్యాయి. మొత్తానికి టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇక ఈ సినిమా సక్సెస్ మీట్ లో టిల్లు క్యూబ్ కూడా ఉందని చెప్పాడు సిద్ధు జొన్నలగడ్డ. అయితే సిద్ధు ఈజీగా టిల్లు క్యూబ్ అని అనౌన్స్ చేశాడు కానీ అతను చెప్పినంత ఈజీగా అయితే టిల్ల్ క్యూబ్ ఉండే అవకాశం లేదు.డీజే టిల్లు లో సిద్ధు పాత్ర ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు కాబట్టి ఆ మ్యాజిక్ తో డీజే టిల్లు సూపర్ హిట్ అయ్యింది. టిల్లు స్క్వేర్ లో అది రిపీట్ అయినా కూడా కేవలం సిద్ధు క్యారెక్టరైజేషన్, డైలాగ్స్ కే ఎక్కువ మార్కులు పడ్డాయి. కానీ టిల్లు క్యూబ్ లో ఈసారి ఆ పప్పులేమి ఉడకవు.కచ్చితంగా టిల్లు క్యూబ్ కొత్త కథతో మ్యాజిక్ చెయ్యాల్సిందే. టిల్లు క్యారెక్టర్ కూడా కొత్తగా ఉండాల్సిందే.మరి టిల్లు క్యూబ్ లో సిద్ధూ సూపర్ హీరోగా చేస్తాడని అంటున్నాడు. మరి అది ఎంతవరకు వర్క్ ఔట్ అయ్యిద్దో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: