"ప్రతినిధి 2" వరల్డ్ వైడ్ థియేటర్ హక్కులు ఆ సంస్థ చేతికి..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన హీరో లలో ఒకరు అయినటువంటి నారా లోహిత్ కొంత కాలం క్రితం ప్రతినిధి అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.  శుభ్ర అయ్యప్ప , శ్రీవిష్ణు ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో నటించగా... ప్రతాప్ మండల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు . 2014 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా ఆ టైం లో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని మంచి విజయం సాధించింది.
 

ఈ సినిమా మంచి విజయం సాధించడంతో నారా రోహిత్ తాజాగా "ప్రతినిధి 2" అనే సినిమాలో హీరో గా నటించాడు . ఈ సినిమాకి మూర్తి దేవగుప్తాపు దర్శకత్వం వహించాడు . ఈ సినిమాను ఏప్రిల్ 25 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదల చేయనున్నారు . ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ప్రపంచ వ్యాప్త థియేటర్ హక్కులను ఒకే ఒక్క సంస్థకు అమ్మి వేసింది.

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క వరల్డ్ వైస్ థియేటర్ హక్కులను అమోఘ ఎంటర్టైన్మెంట్ సంస్థ దక్కించుకుంది. ఈ విషయాన్ని ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఇక ఈ సంస్థ వారు ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విడుదల చేయడానికి ఇప్పటి నుండే పనులను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

nr

సంబంధిత వార్తలు: