మరో పాన్ ఇండియా చిత్రంలో హీరో తేజ సజ్జా..!!

Divya
హనుమాన్ చిత్రంతో కుర్ర హీరోగా మంచి సక్సెస్ అందుకున్నారు హీరో తేజ సజ్జా ఇప్పుడు మరికొన్ని క్రేజీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలను విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తేజ సజ్జ కూడా కథల విషయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తున్నారు.. రొటీన్ చిత్రాలకు ఎప్పుడు భిన్నంగానే తన సినిమాలను చేస్తూ ఉంటారు. ముఖ్యంగా ఎవరికీ తెలియని పాయింట్స్ తో ఎప్పుడు సెలెక్టివ్ కథలను ఎంచుకుంటూ ఉంటారు తేజ సజ్జ.

తేజ సజ్జ తదుపరిచిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి అనేక రకాల గ్రాఫిక్స్ పనులు కూడా ఇప్పటికే వైరల్ గా మారాయి.రీసెంట్గా ఈ సినిమా నుంచి అఫీషియల్ గా ఒక ప్రత్యేకమైన పోస్టర్ని కూడా చిత్ర బృందం రిలీజ్ చేశారు.. మరో రెండు రోజులలో ఒక క్రేజీ అప్డేట్ రాబోతోంది అంటూ ఇందులో వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే చేసినట్టుగా కనిపిస్తోంది. అంతేకాకుండా ఒక చారిత్రాత్మకంగా అంశంతోనే ఈ సినిమాని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తేరకెక్కిస్తున్నారట.
ఈ సినిమాలో ప్రతి చరిత్ర కూడా ఒక సీక్రెట్ గా ఉండబోతుందని ఈ సీక్రెట్ లో ఒక చరిత్ర దాగి ఉందంటూ పోస్టర్లు వివరణ ఇచ్చారు చిత్రబృందం. చిత్రానికి టైటిల్ కూడా యోధ అని సెట్ చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈనెల 15వ తేదీన మరొక అప్డేట్ కూడా రాబోతోంది. ముఖ్యంగా ఈ చిత్రంలో మంచు మనోజ్ విలన్ గా నటించబోతున్నారు.. ఇక ఈ విషయం పై కూడా త్వరలోనే అధికారికంగా ఒక అప్డేట్ రాబోతోంది. ఒకవేళ మంచు మనోజ్ విలన్ గా నటిస్తే ఖచ్చితంగా ఈ సినిమాకి హైలైట్ గా అవుతుందని తేజ సజ్జ అభిమానులు భావిస్తున్నారు. అలాగే కీలకమైన పాత్రలో దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్టు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: