లియో తర్వాత త్రిష మళ్లీ ఛాన్స్..!

shami
లాస్ట్ ఇయర్ లియోతో హిట్ అందుకున్న దళపతి విజయ్ హీరోగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెంకట్ ప్రభు డైరెక్షన్ లో ఘ్.ఓ.ఆ.ట్ సినిమా వస్తుందని తెలిసిందే. ఏ.జి.ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో తెరకెక్కుతున్న ఈ మూవీ అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో విజయ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా సినిమాలో ఆల్రెడీ మీనాక్షి చౌదరి ఒక హీరోయిన్ గా నటిస్తుంది. అయితే ఈ మూవీలో మరో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందని తెలుస్తుంది. ఆ లక్కీ ఛాన్స్ ను త్రిష కొట్టేసిందని టాక్. విజయ్ లాస్ట్ మూవీ లియో సినిమాలో కూడా విజయ్ తో త్రిష కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. మళ్లీ ఈ సినిమా కోసం కలిసి నటించనున్నారు.
సినిమాలో విజయ్ యంగ్ ఏజ్ రోల్ ఒకటి కాగా మిడిల్ ఏజ్ రోల్ ఒకటి ఉంటుంది. ఆ రోల్ కి జతగా విజయ్  త్రిష కనిపిస్తుందని తెలుస్తుంది. రెండు దశాబ్ధాలుగా సౌత్ సినీ ఆడియన్స్ ను తన సినిమాలతో అలరిస్తూ వస్తుంది త్రిష. ఇప్పటికీ తన ఫాం ఏమాత్రం తగ్గలేదు. తెలుగులో కూడా త్రిష ఈమధ్య వరుస ఛాన్స్ లు అందుకుంటుంది. వశిష్ట డైరెక్షన్ లో తెరకెక్కుతున్న విశ్వంభర లో చిరు యో కలిసి నటిస్తుంది త్రిష.  
విజయ్ గోట్ సినిమాలో త్రిష ఉంటుందని తెలిసి ఆమె ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు. సీనియర్ స్టార్ హీరోలకు హీరోయిన్ గా త్రిష పర్ఫెక్ట్ గా ఉంటుంది. అందుకే చెన్నై చిన్నదాన్ని మళ్లీ మళ్లీ తీసుకుంటున్నారు. తెలుగులో విశ్వంభర చేస్తుంది అని తెలిసి వరుస ఆఫర్లతో త్రిష వెంట పడుతున్నారు మన దర్శక నిర్మాతలు. మరి త్రిష వాటిలో ఏది ఓకే చేస్తుంది అన్నది త్వరలో తెలుస్తుంది.వెంకటేష్ నెక్స్ట్ సినిమాలోనూ నాగార్జున కూడా త్రిషను తన తర్వాత సినిమాలో హీరోయిన్ గా తీసుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: