దేవర ను కార్నర్ చేస్తున్న వేటగాడు !

Seetha Sailaja
‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ తరువాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ‘దేవర’ మూవీ పై అత్యంత భారీ అంచనాలు ఉన్నాయి. వాస్తవానికి ఈసినిమా ‘ఉగాది’ పండుగను టార్గెట్ చేస్తూ ఏప్రియల్ 5న విడుదలకావలసి ఉంది. అయితే ఈమూవీ షూటింగ్ పూర్తి అవ్వకపోవడంతో ఈమూవీని అక్టోబర్ లో వచ్చే ‘దసరా’ పండుగను టార్గెట్ చేస్తూ అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నారు.

ఈమూవీ పాన్ ఇండియా స్థాయిలో నిర్మాణం చేస్తున్న పరిస్థితులలో ఈమూవీని అన్ని రాష్ట్రాలలోనూ భారీ స్థాయిలో విడుదల చేసి జూనియర్ మార్కెట్ ను అదేవిధంగా అతడి ఇమేజ్ ని పెంచడానికి పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటివరకు ఈసినిమాకు ఎటువంటి పోటీ లేదు అని అంతా భావించారు. అయితే ఎవరు ఊహించని విధంగా రజనీకాంత్ జ్ఞానవేలు దర్శకత్వంలో నటిస్తున్న భారీ సినిమా కూడ అదే సమయంలో పాన్ ఇండియా మూవీగా విడుదల అవుతున్న పరిస్థితులలో జూనియర్ ‘దేవర’ కు గట్టిపోటీ తప్పదు అన్నసంకేతాలు వస్తున్నాయి.

వాస్తవానికి ‘జైలర్’ మూవీ విడుదల అయ్యేంతవరకు రజనీకాంత్ ఇమేజ్ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో బాగా తగ్గిపోయింది. అయితే ఆమూవీ సూపర్ హిట్ అవ్వడంతో మళ్ళీ తెలుగు ప్రేక్షకులలో రజనీకాంత్ మ్యానియా బాగా ఏర్పడింది. దీనికితోడు రజనీకాంత్ నటిస్తున్న ఈమూవీలో రానా అమితాబచ్చన్ రావ్ రమేష్ ఫహాద్ ఫాజిల్ లాంటి తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న నాటీనటులు నటిస్తూ ఉండటంతో ఇది డబ్బింగ్ సినిమా అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు తెలుగు మూవీ చూస్తున్న అనుభూతి ఏర్పడటం ఖాయం అని అంటున్నారు.

దీనికితోడు ఈమూవీకి ‘వేటగాడు’ అన్న టైటిల్ ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సీనియర్ ఎన్టీఆర్ నటించిన సినిమాలలో ‘వేటగాడు’ ఒకనాటి బ్లాక్ బష్టర్ హిట్ సీనియర్ ఎన్టీఆర్ మనవడు తారక్ నటించిన ‘దేవర’ మూవీకి ఇప్పుడు ‘వేటగాడు’ పోటీగా విడుదల అవుతూ ఉండటంతో ఈమూవీ కలక్షన్స్ పై ఎంతోకొంత ప్రభావం ఉంటుంది అన్న అంచనాలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: