ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి
ఎస్ ఎస్ రాజమౌళి తన కెరియర్ ప్రారంభంలో నితిన్ హీరోగా జెనీలియా
హీరోయిన్ గా "సై" అనే స్పోర్ట్స్ ప్లస్
మాస్ యాక్షన్ ఎంటర్టైనర్
మూవీ కి దర్శకత్వం వహించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ కి
రాజమౌళి తండ్రి అయినటువంటి
విజయేంద్ర ప్రసాద్ కథను అందించగా ... ఎం ఎం
కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు.
ఈ
మూవీ 2004 వ సంవత్సరం భారీ అంచనాలు నడుమ
థియేటర్ లలో విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ
మూవీ ద్వారా నితిన్ కు జెనీలియాకు అద్భుతమైన గుర్తింపు లభించింది. అలాగే
రాజమౌళి కి కూడా ఈ
సినిమా ద్వారా మంచి క్రేజ్ వచ్చింది. ఇలా ఆ సమయంలో అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ
థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. తాజాగా ఈ
మూవీ మేకర్స్ ఈ రోజు ఉగాది
పండుగ సందర్భంగా ఉగాది శుభాకాంక్షలు అతి త్వరలో అంటూ ఓ
పోస్టర్ ను విడుదల చేసింది.
ఇక దీనితో ఈ
సినిమా మరికొన్ని రోజుల్లోనే ఈ
మూవీ రీ రిలీస్ ఉండబోతున్నట్లు క్లియర్ గా అర్థం అవుతుంది. ఈ మధ్య కాలంలో చాలా తెలుగు సినిమాలు రీ రిలీజ్ అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్ లను వసూలు చేశాయి. ఇక ఈ
సినిమా అప్పట్లో బ్లాక్ బాస్టర్
మూవీ నే కావడంతో ఈ
మూవీ కి కూడా రీ రిలీజ్ లో మంచి కలెక్షన్ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి.