"జవాన్" కి తెలుగులో మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

frame "జవాన్" కి తెలుగులో మొదటిసారి వచ్చిన "టిఆర్పి" రేటింగ్ ఇదే..!

Pulgam Srinivas
బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి షారుక్ ఖాన్ పోయిన సంవత్సరం జవాన్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో లేడీ సూపర్ స్టార్ నయన తార మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని దీపికా పదుకొనే హీరోయిన్ లుగా నటించగా ... కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లలో ఒకరు అయినటువంటి అట్లీ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించిన ఈ మూవీ లో సంజయ్ దత్ ఓ కీలక పాత్రలో నటించాడు.


ఈ మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. దానితో ఈ మూవీ 1000 కోట్లకు పైగా కలెక్షన్ లను రాబట్టి అదిరిపోయే రేంజ్ విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. ఇకపోతే ఈ మూవీ తెలుగు వర్షన్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను రాబట్టింది. ఇక ఆ తర్వాత ఈ సినిమా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చి "ఓ టి టి" ప్రేక్షకులను కూడా భాగానే అలరించింది.


ఇక కొన్ని రోజుల క్రితమే ఈ సినిమా వరల్డ్ లో టెలివిజన్ ప్రీమియర్ గా తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను మొదటి సారి బుల్లి తెరపై ఈ సంస్థ ప్రచారం చేయగా అందులో భాగంగా ఈ సినిమాకి 2.06 "టి ఆర్ పి" రేటింగ్ మాత్రమే వచ్చింది. బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాకి ఈ రేంజ్ "టి ఆర్ పి" రేటింగ్ అంటే చాలా తక్కువ అనే చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: