యంగ్
హీరో విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో గీత గోవిందం
సినిమా వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. హిట్ కాంబో ను రిపీట్ చేస్తూ దిల్ రాజు ఫ్యామిలీ స్టార్ సినిమాను నిర్మించి ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చాడు.బాలీవుడ్ హాట్
బ్యూటీ తెలుగులో వరుస హిట్లతో గోల్డెన్ లెగ్ గా పేరు తెచ్చుకున్న మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో
హీరోయిన్ గా నటించింది. ఇక తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ల ఫ్యామిలీ స్టార్
మూవీ కి దారుణమైన నెగటివ్ టాక్ వచ్చింది. ఈ
సినిమా పై మొదటి నుంచి కూడా పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చిత్ర యూనిట్ సభ్యులు ప్రచారం చేస్తూ వచ్చారు. కానీ
సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి ఆటతోనే సినిమాకు ప్లాప్ టాక్ వచ్చింది. పైగా అది చాలదన్నట్లు సోషల్ మీడియాలో మాత్రం కొందరు ఈ మూవీని ఫస్ట్ నుంచి దారుణంగా ట్రోల్స్ చేస్తూ వచ్చారు. దాంతో ఈ
సినిమా వసూళ్ల విషయంలో దిల్ రాజుకు ఖచ్చితంగా దారుణమైన షాక్ ఇవ్వడం ఖాయం విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. మొదటి రోజు వసూళ్ల విషయంలో ఈ
సినిమా మరీ అంత దారుణంగా కాకుండా కాస్త పర్వాలేదు అన్నట్లు ఉంది. అయితే సెకండ్ డే చాలా ఘోరంగా ఉందట పరిస్థితి. తెలంగాణలో బాగా పట్టున్న
విజయ్ కి ఫస్ట్ డే ఫస్ట్ డే ఫ్యామిలీ స్టార్ 2 కోట్లు కూడా వసూలు చేయలేకపోయింది.
రెండో రోజు అయితే కోటి
కన్నా తక్కువే. ఇక రెండు రోజుల్లో ఈ
సినిమా కేవలం 15 కోట్ల గ్రాస్ మాత్రమే సాధించింది.లాంగ్ రన్ లో మాత్రం పరిస్థితి ఖచ్చితంగా చాలా దారుణంగా ఉంటుంది. 6 ఏళ్ల నుంచి హిట్టు లేక వరుస ప్లాపుల్లో ఉన్న
విజయ్ కి ఈ
సినిమా ఇంకా కోలుకోలేని దెబ్బ తీసింది. వరుస హిట్లతో ఊపుమీదున్న మృనాల్ టాకూర్ కి కూడా ఈ
సినిమా గట్టి షాక్ ఇచ్చింది.ఈ
మూవీ హిట్ అయితే
టాలీవుడ్ లో టాప్
హీరోయిన్ గా ఫిక్స్ అవుతుందనుకున్న మృనాల్ ఈ సినిమాతో ఉన్న అవకాశాలు కూడా పోగొట్టుకునే ఛాన్స్ ఉంది. దర్శకుడు
పరశురామ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సర్కారు వారి పాట
సినిమా హిట్టు కొట్టిన దర్శకుడు కాబట్టి ఖచ్చితంగా ఫ్యామిలీ స్టార్ పై అంచనాలు ఉంటాయి. కానీ ఆ అంచనాలకి ఈ
సినిమా ఏమాత్రం మ్యాచ్ అవ్వలేదు. మహేష్ ఫ్యాన్స్ కి సర్కారు వారి పాట లాంటి స్టైలిష్ హిట్ ఇచ్చిన
పరశురామ్ ఇలాంటి ఒక రాడ్డు
సినిమా తీస్తాడని ఎక్స్పక్ట్ చేయలేదని
నెటిజన్స్ అంటున్నారు. ఇక దిల్ రాజు విషయానికి వస్తే
టాలీవుడ్ అగ్ర నిర్మాతగా ఉన్నా కూడా ఫెయిల్యూర్స్ నుంచి పాఠాలు నేర్చుకోట్లేదు. వారిసు లాంటి ఫెయిల్యూర్ ఎదురుకున్నా కూడా మళ్ళీ ఫ్యామిలీ
జోనర్ లో ఫ్యామిలీ స్టార్ తీసి ఫెయిల్ అయ్యాడు.