RGV సంచలన ప్రకటన.. ఇకపై ఆ సినిమాలు చేయడట?

praveen
రాంగోపాల్ వర్మ.. ఈ పేరు గురించి టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే తన తన సినిమాలతో ఇప్పటికే సుపరిచితుడుగా మారిపోయాడు ఆర్జీవి. ఒకప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో సైతం ఇక ప్రేక్షకులను తన సినిమాలతో మెస్మరైజ్ చేసిన ఈ డైరెక్టర్ ఇటీవల కాలంలో మాత్రం వివాదాస్పద సినిమాలకు చిరునామాగా మారిపోయాడు. ఇక ఇప్పుడు ఆర్జీవి తెరకెక్కించిన  సినిమాలు చూస్తే ఈయనేనా ఒకప్పుడు శివా లాంటి ఒక బ్లాక్ బస్టర్ను తీసింది అనే అనుమానం కలగక మానదు.

 నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురోయ్ అన్న విధంగా.. ఆయన రూటే సెపరేట్ గా ఉంటుంది. నచ్చింది మాట్లాడటం. నచ్చింది చేయడం ఎవరేమనుకుంటారు అని ఆలోచించకపోవడం ఆయన స్టైల్. అందుకే ఆర్జీవి అంటే పడి చచ్చిపోయే యూత్ చాలామంది ఉన్నారు. ఆయనలా ఒక్కరోజు బతికిన చాలు జీవితానికి ఇంకేం కావాలి అనుకునే వారు కూడా లేకపోలేదు. అదే సమయంలో ఇతనేంట్రా  బాబు ఇలా ఉన్నాడు.. అంటూ విమర్శలు చేసేవారు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆంధ్ర రాజకీయాలను  టార్గెట్ చేస్తూ ఆర్జీవి తీసిన సినిమాలు వివాదాస్పదంగా మారిపోతూనే ఉన్నాయి అన్న విషయం తెలిసిందే.

 ఇలాంటి సమయం లో డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ సంచలన ప్రకటన చేశాడు. ఇకపై రాజకీయ నేపథ్య సినిమాలకు దూరం గా ఉండనున్నట్లు ప్రకటించాడు. కొత్త టాలెంట్ను ప్రోత్సహిస్తాను అంటూ ఆర్జీవి తెలిపాడు. ఇందుకోసం యువర్ ఫిలిమ్స్ అనే కాన్సెప్ట్ ను ఆయన ప్రారంభించారు. సినిమాకు సంబంధించి ది బెస్ట్ టాలెంట్స్ ను గుర్తించి.. వారితో సినిమాలు తీస్తాం. క్రౌడ్ ఫండెడ్ ఆలోచన కూడా ఉంది అంటూ ఆర్జీవి చెప్పుకొచ్చాడు.  ఈ విషయం తెలిసి హమ్మయ్య ఎప్పుడు మారతాడా అనుకున్నాం. చివరికి ఇప్పుడు మారిపోయినట్టున్నాడు అంటూ ఇంటర్నెట్ జనాలు కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rgv

సంబంధిత వార్తలు: