టాలీవుడ్
ఇండస్ట్రీ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న ముద్దు గుమ్మలలో
అనన్య నాగళ్ళ ఒకరు. ఈమె మల్లేశం అనే
మూవీ తో
వెండి తెరకు పరిచయం అయ్యి ఈ
సినిమా లోనే తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈమె ఎన్నో సినిమాలలో నటించింది. అందులో
అనన్య నటించిన కొన్ని
మూవీ లు
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను కూడా అందుకున్నాయి.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ
బ్యూటీ "తంత్ర" అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ
మూవీ ని ఫస్ట్ కాపీ మూవీస్ , బి ద వే ఫిల్మ్స్ బ్యానర్ లపై
నరేష్ బాబు పి ,
రవి చైతన్య సంయుక్తంగా నిర్మించగా ... మనోజ్ ముత్యం,
శరత్ బరిగెలా, కుషాలినీ తదితరులు ఈ
మూవీ లో ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ
మూవీ పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ
మార్చి 15 వ తేదీన
థియేటర్ లలో విడుదల అయ్యింది. ఇకపోతే ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ మాత్రం ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది.
దానితో ఈ
మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరుత్సాహ పరిచిన ఈ
సినిమా తాజాగా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ
సినిమా యొక్క "ఓ టి టి" హక్కులను ఆహా సంస్థ వారు దర్శించుకున్నారు. అందులో భాగంగా ప్రస్తుతం ఈ సినిమాను వీరు ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఎవరైనా ఈ
మూవీ ని
థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ
సినిమా తెలుగు భాషలో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.