బాలీవుడ్ స్టార్
హీరో హృతిక్ రోషన్ నటించిన లేటెస్ట్
మూవీ ఫైటర్.. .. ఈ
మూవీ ఈ ఏడాది జనవరిలో రిపబ్లిక్ డే సందర్భంగా థియేటర్లలో రిలీజైంది..కానీ ప్రపంచవ్యాప్తంగా ఈ
మూవీ భారీ వసూళ్లు సాధించలేకపోయింది.
ఈ మూవీలో స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ హీరోయిన్ గా నటించింది .ఈ
సినిమా మార్చి 21న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది..
థియేటర్ లో అంతగా ఆకట్టుకోని
ఫైటర్ మూవీ ఓటీటీలో మాత్రం అద్భుతంగా దూసుకెళ్తోంది. నెట్‌ఫ్లిక్స్ లో యానిమల్
మూవీ రికార్డులను కూడా
ఫైటర్ మూవీ బ్రేక్ చేసింది. పది రోజుల్లోనే
ఫైటర్ మూవీ రికార్డు వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని గురువారం (ఏప్రిల్ 4) హృతిక్ తన ఇన్‌స్టా స్టోరీ ద్వారా వెల్లడించాడు. నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చిన తొలి పది రోజుల్లో రికార్డు వ్యూస్ సొంతం చేసుకున్న
హిందీ సినిమాగా
ఫైటర్ నిలిచింది.ఈ రికార్డు బ్రేకింగ్ విషయాన్ని మొదట
బాలీవుడ్ బాక్సాఫీస్ ఎక్స్ లో పోస్ట్ చేసింది.
"ఓ
బాలీవుడ్ సినిమా గత రికార్డులన్నింటినీ నెట్‌ఫ్లిక్స్ లో
ఫైటర్ బ్రేక్ చేసింది. యానిమల్, డంకీ లాంటి సినిమాలను దాటేసింది.
హృతిక్ రోషన్ నటించిన ఈ
సినిమా నెట్‌ఫ్లిక్స్ లో తొలి పది రోజుల్లోనే 12.4 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ నంబర్లను అత్యంత వేగంగా అందుకున్న
బాలీవుడ్ సినిమా ఇదే" అని
బాలీవుడ్ బాక్సాఫీస్ తెలిపింది.
ఈ ట్వీట్ ను హృతిక్ తన ఇన్‌స్టా స్టోరీస్ లో పోస్ట్ చేశాడు. యానిమల్
మూవీ గతేడాది
డిసెంబర్ 1న థియేటర్లలో రిలీజై ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజయం సాధించింది. ఈ ఏడాది
జనవరి 26న నెట్‌ఫ్లిక్స్ లో యానిమల్
మూవీ స్ట్రీమింగ్ కి వచ్చింది. అప్పటి వరకూ ఈ ఓటీటీలో దుమ్ము రేపుతున్న సలార్ మూవీని కూడా వెనక్కి నెట్టి రికార్డులు బ్రేక్ చేసింది. ఆ తర్వాత షారుక్ ఖాన్ డంకీ
మూవీ వచ్చినా కూడా ఓటీటీలో యానిమల్ హవా కొనసాగుతూనే వుంది. సిద్దార్థ్
ఆనంద్ తెరకెక్కించిన
ఫైటర్ మూవీ ఈ రికార్డు ను బ్రేక్ చేసింది. హృతిక్, దీపికా ఈ మూవీలో
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులుగా నటించారు.ఈ
సినిమా భారీ అంచనాలతో విడుదల అయింది. కానీ అనుకున్న స్థాయిలో కలెక్షన్లు మాత్రం సాధించలేకపోయింది.