చివరి సినిమాకి.. దళపతి విజయ్ భారీ రెమ్యూనరేషన్.. ఎన్ని వందల కోట్లంటే?

praveen
కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు దళపతి విజయ్. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత ఇక ఆ స్థాయిలో గుర్తింపును సంపాదించుకున్న ఏకైక హీరో విజయ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. గత కొంతకాలం నుంచి వరుసగా సూపర్ హిట్లు కొడుతూ వస్తున్న దళపతి విజయ్ ఇక ఇప్పుడు వరుసగా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అలాగే ఒక రాజకీయ పార్టీని కూడా స్థాపించాడు అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే  సినిమాలను దూరం పెట్టి పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా మారెందుకు రెడీ అవుతున్నాడు ఈ స్టార్ హీరో.

 దీంతో అభిమానులు అందరూ కూడా నిరాశలో మునిగిపోయారు. ఇక ఇప్పటికే గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం అనే సినిమాతో అటు దళపతి విజయ్ బిజీగా ఉన్నాడు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ జరగకంగా జరుగుతుంది. ఇక ఈ మూవీ పై అభిమానులు అందరిలో కూడా రెట్టింపు అంచనాలు ఉన్నాయి అని చెప్పాలి. అయితే రాజకీయాల్లోకి వెళ్ళడానికి ముందు చివరిగా ఒక సినిమా చేయాలని దళపతి విజయ్ అనుకుంటున్నాడట. ఈ క్రమంలోనే హెచ్ వినోద్ తో ఒక మూవీ చేయబోతున్నాడు అన్నది తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో దళపతి విజయ్ పారితోషకం ఎంత అనే విషయంపై కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయాయి.

 తన కెరియర్ లోనే చివరి సినిమాగా ఇక హెచ్ వినోద్ తో చేస్తున్న మూవీ కోసం ఏకంగా 250 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నాడట దళపతి విజయ్. అయితే ఇంత పెద్ద మొత్తంలో ఇక ఆ హీరోకి ఇచ్చేందుకు ప్రొడ్యూసర్లు కూడా రెడీ అయ్యారట. మరోవైపు గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం సినిమా కోసం కూడా 200 కోట్లు తీసుకుంటున్నాడట. ఇక విజయ్ కెరీర్ లోనే ఇదే టాప్ రెమ్యూనరేషన్ అని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి అందరూ షాక్ అవుతున్నారు. అంతకుముందు 100 నుంచి 120 కోట్ల రూపాయల వరకు మాత్రమే విజయ్ ఒక్కో సినిమాకి రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఉండేవాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: