బన్నీ అభిమానులకు బ్యాడ్ న్యూస్..!

Pulgam Srinivas
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ పుట్టిన రోజు ఈ నెల 8 వ తేదీన అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈయన నటించిన మంచి సినిమాలలో ఒకటి అయినటువంటి "ఆర్య 2" మూవీ ని థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. దానితో ఈ క్లాసిక్ మూవీ ని థియేటర్ లలో చూడాలి అని బన్నీ అభిమానులు ఎంతో ఆశపడ్డారు.

ఇకపోతే చివరగా ఈ మూవీ బృందం బన్నీ అభిమానుల ఆశల మీద నీళ్లు చల్లింది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు ఈ సినిమా రీ రిలీస్ విషయంలో వెనక్కు తగ్గినట్లు తెలుస్తోంది. ఈ సినిమాను ఈ సంవత్సరం చివరలో థియేటర్ లలో రీ రిలీజ్ చేయడానికి ఈ మూవీ బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని రోజుల క్రితం జులాయి సినిమాను కూడా ఈ సంవత్సరం అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా కొన్ని థియేటర్ లలో స్పెషల్ షో లు వేయనున్నట్లు ప్రకటించారు. ఈ మూవీ స్పెషల్ షో లు కూడా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ఇలా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ కానున్నట్లు ప్రకటించిన రెండు సినిమాలు కూడా వాయిదా కావడంతో బన్నీ అభిమానులు తీవ్ర నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ "పుష్ప పార్ట్ 2" అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ యొక్క టీజర్ న బన్నీ పుట్టి నరోజు అయినటువంటి ఏప్రిల్ 8 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమా టీజర్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నిలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా టీజర్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

Aa

సంబంధిత వార్తలు: