కళ్యాణ్
రామ్ హీరో గా సంయుక్తా
మీనన్ , కేథరిన్
హీరోయిన్ లుగా మల్లాడి వశిష్ట బింబిసార అనే
మూవీ ని తెరకెక్కించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ
మూవీ మంచి అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ఈ
మూవీ తో
కళ్యాణ్ రామ్ కి సూపర్ సాలిడ్ విజయం
బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. అలాగే తక్కువ బడ్జెట్ తో ఈ
మూవీ ని తెరకెక్కించిన విధానానికి గాను దర్శకుడు మల్లాడి వశిష్ట కి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి.
ఇకపోతే మొదటి
మూవీ తోనే మంచి విజయాన్ని .... సూపర్ క్రేజ్ ను తెలుగు సినీ పరిశ్రమలో దక్కించుకున్న ఈ
యువ దర్శకుడు ప్రస్తుతం
మెగాస్టార్ చిరంజీవి హీరో గా
త్రిష హీరోయిన్ గా విశ్వంభర అనే ఓ భారీ బడ్జెట్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ
మూవీ లో ఇషా చావ్లా ,
సురభి ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... ఎం ఎం
కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఈ
మూవీ ని
యువి క్రియేషన్స్ బ్యానర్ పై
వంశీ , ప్రమోద్ పు ఎంతో భారీ బడ్జెట్ తో చాలా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ
మూవీ ని వచ్చే సంవత్సరం
సంక్రాంతి పండుగ సందర్భంగా
జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ
మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు.
తాజాగా ఈ
మూవీ బృందం వారు ఈ
సినిమా షూటింగ్ కు సంబంధించిన ఓ ఫోటో ను విడుదల చేశారు. అందులో ప్రముఖ ఫైట్ మాస్టర్లు అయినటువంటి
రామ్ లక్ష్మణ్ ... అలాగే ఈ
సినిమా దర్శకుడు మల్లాడి వశిష్ట ఉన్నారు. ఇక ప్రస్తుతం ఈ
మూవీ బృందం వారు
రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ భారీ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నట్లు ఈ యాక్షన్ సన్నివేశం ఈ
మూవీ కే హైలైట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది.