టిల్లు క్యూబ్ తో సిద్దూ కొత్త ప్రయోగం ఫలిస్తుందా?

Purushottham Vinay
టిల్లు స్క్వేర్ సినిమా ఫస్ట్ షోతోనే పాజిటివ్ టాక్ దక్కించుకుని బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతోంది. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఏకంగా రూ.78 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి.. రూ.100 కోట్ల దిశగా వెళుతోంది. ఇప్పటికే రూ.14 కోట్లకు పైగా లాభాలు వచ్చినట్లు సమాచారం తెలుస్తోంది.తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నా.. డీజే టిల్లు సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ క్యారెక్టర్ సినీ ప్రియులకు అంత బాగా నచ్చేసింది. ఇప్పుడు టిల్లు స్క్వేర్ సినిమాకు కూడా కనెక్ట్ అయ్యారు ఆడియన్స్. దీంతో ఇదే ఊపులో టిల్లు క్యూబ్‌ సినిమాను కూడా ప్రకటించేశారు మేకర్స్. ఇక సీక్వెల్ పై నెట్టింట జోరుగా చర్చ సాగుతున్న వేళ.. టిల్లు క్యూబ్ మూవీపై ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు హీరో సిద్ధు.టిల్లు ఫ్రాంచైజీలో డైనమిక్ మార్పులు చేయాలనుకుంటున్నట్లు హీరో సిద్ధు తెలిపారు. "డీజే టిల్లు మూవీ ఓ అమ్మాయి మోసం చేసే పాయింట్‌ చుట్టూ కథ తిరుగుతుంది. టిల్లు స్క్వేర్‌ సినిమా కూడా అదే పాయింట్‌ తో వచ్చింది. కానీ ఈ సారి టిల్లు క్యూబ్‌ లో టిల్లుకు సూపర్ పవర్స్ వస్తే ఏం చేస్తాడు? అనే పాయింట్ మీద కథ అంతా నడుస్తుంది" అని సిద్ధూ తెలిపారు.


త్వరలోనే ఆ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెడతానని సిద్ధూ అప్డేట్ కూడా ఇచ్చారు.ఇప్పటి దాకా మంచి కామెడీ పంచిన టిల్లు.. ఇప్పుడు సూపర్ హీరోగా రావడం వెనుక ఉన్న అసలు కారణమేంటి అని అంటున్నారు. ఇటీవల సూపర్ హీరో సినిమాలు ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో ఇది మంచి టర్న్ అనుకోని సిద్ధు డిసైడ్ అయ్యాడేమో అని టిల్లు ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.అయితే టిల్లు ఫ్రాంచైజికి మూలం కామెడీ అండ్ ఎంటర్టైన్మెంట్. సూపర్ హీరోగా కూడా కామెడీ పండిస్తే సినిమా సక్సెస్ అవ్వడం పక్కా. ఐడియా బాగానే ఉన్నా కానీ సూపర్ హీరో కాన్సెప్ట్ కి లాజిక్ అనేది ఉండాలి. ఆ విషయంలో రిస్క్ ఉంటుందని నెటిజన్స్ చెబుతున్నారు.అయితే ఒకే పాయింట్ తో సీక్వెల్స్ చేస్తే ఆడియన్స్ ఖచ్చితంగా విసుగు చెందే అవకాశం ఉందని, హైప్ కూడా తగ్గుతుందని చెబుతున్నారు. సిద్ధు సూపర్ హీరో ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: