బాక్సాఫీస్ వద్ద ది గోట్ లైఫ్ సినిమా జోరు ఇప్పట్లో ఆగేలా లేదు. పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఈ సర్వైవల్ డ్రామా ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద సాలిడ్ బ్లాక్ బస్టర్ స్టేటస్ సంపాదించింది. సీనియర్ ఫిల్మ్ మేకర్ బ్లెస్సీ దర్శకత్వంలో రూపొందిన ఆడుజీవితం: ది గోట్ లైఫ్ ఇప్పుడు సరికొత్త రికార్డుని సృష్టించింది. ఈ సినిమా మలయాళ సినీ చరిత్రలో ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద సోమవారం రోజున అతిపెద్ద కలెక్షన్‌ను నమోదు చేసి ఆశ్చర్యపరిచింది. ట్రేడ్ వర్గాల అప్‌డేట్ ప్రకారం, ది గోట్ లైఫ్ సినిమా విడుదలైన మొదటి 5 రోజుల్లోనే ఏకంగా 75 కోట్ల గ్రాస్ మార్కును రాబట్టింది. నార్త్ అమెరికాలో చాలా ఫాస్ట్ గా హాఫ్ మిలియన్ మార్క్ అందుకున్న మలయాళం సినిమాగా ఈ సినిమా రికార్డుల్లో నిలిచింది.ఈ సినిమా కేవలం సెలవు రోజుల్లో కాకుండా సాధారణ రోజుల్లో కూడా బాక్సాఫీస్ వద్ద మంచి పట్టును చూపుతోంది. 5వ రోజు ప్రపంచ వ్యాప్తంగా 10 కోట్ల గ్రాస్ రాబట్టిన ఈ సినిమా అదే రోజున కేరళ బాక్సాఫీస్ నుండి మాత్రమే 4.75 కోట్ల గ్రాస్ వసూలు చేయడం విశేషం.
మలయాళ సినిమాల్లో అత్యంత వేగంగా రూ. 75 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన సినిమాగా కూడా ఈ సినిమా రికార్డు క్రియేట్ చేసింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా లాంగ్ రన్ ఇదే స్థాయిలో కొనసాగితే ఇండస్ట్రీ హిట్ అవ్వడం పక్కా.ది గోట్ లైఫ్ సినిమా ఈరోజుతో (6వ రోజు) బాక్సాఫీస్ వద్ద 83 కోట్ల మార్క్ సాధిస్తుందని ట్రేడ్ నిపుణులు అంటున్నారు. అదే జరిగినట్లయితే ఈరోజు చివరి నాటికి దుల్కర్ సల్మాన్ నటించిన కురుప్ సినిమా లైఫ్ టైమ్ కలెక్షన్లను కూడా పృథ్వీరాజ్ గోట్ సినిమా ఈజీగా అధిగమించవచ్చు.ఇంకో మూడు నాలుగు రోజుల్లో ది గోట్ లైఫ్ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరడం చేరడం ఖాయం కనిపిస్తుంది. ఇక ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే మొదటి రెండు వారాల్లోనే ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా 200 కోట్ల మార్కును దాటే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. త్వరలోనే ఈ సినిమా గల్ఫ్ దేశాల్లో కూడా విడుదల కానుంది. మలయాళ సినిమాలకి గల్ఫ్ మార్కెట్ లో చాలా మంచి మార్కెట్ ఉంది.