ఓటీటీ లోకి వచ్చేస్తున్న 'తంత్ర' మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

murali krishna
టాలీవుడ్ బ్యూటీ అనన్య నాగళ్ల నటించిన లేటెస్ట్ మూవీ తంత్ర. శ్రీనివాస్ గోపిశెట్టి తెరకెక్కించిన ఈ హర్రర్ థ్రిల్లర్ లో ధనుష్ రఘుముద్రి, సలోని, టెంపర్ వంశీ మరియు మీసాల లక్ష్మణ్ ముఖ్య పాత్రలు పోషించారు.టీజర్స్, ట్రైలర్‌ తోనే ప్రేక్షకులను భయపెట్టిన తంత్ర  మూవీ మార్చి 15న థియేటర్లలో రిలీజైంది.ప్రేక్షకుల నుండి ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ లభించింది.. అంతే కాదు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు కూడా రాబట్టింది.ఈ మూవీలో హారర్ అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా బాగున్నాయని రివ్యూలు వచ్చాయి. అయితే థియేటర్లలో ప్రేక్షకులను భయపెట్టిన తంత్ర మూవీ నెల తిరగకుండానే కేవలం 20 రోజులకే డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహా ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకుంది. ఏప్రిల్ 5 నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ కు తీసుకురానున్నారు. తాజాగా ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఆహా అధికారికంగా ప్రకటించింది. 


'తంత్రం మంత్రం కుతంత్రం', 'ఆహా అందిస్తోన్న మరో హారర్ చిత్రం' అంటూ తంత్ర ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు పోస్టర్ ను షేర్ చేసింది.ఈ మూవీని ఫస్ట్ కాపీ మూవీస్ మరియు బి ద వే ఫిల్మ్స్ బ్యానర్లపై నరేష్ బాబు పి, రవిచైతన్య సంయుక్తంగా  నిర్మించారు ఈ మూవీ కథ విషయానికొస్తే.. రేఖ (అనన్య నాగళ్ల) పుట్టుకతోనే తల్లి రాజ్యలక్ష్మిని (సలోని) కోల్పోతుంది.తన నాన్నమ్మ దగ్గర పెరుగుతుంది.. తేజూ (ధనుష్ రఘుముద్రి)ను ప్రేమిస్తుంది. అయితే తేజూ వేశ్య కొడుకు కావడంతో వారి ప్రేమకు కొన్ని అడ్డంకులు ఎదురవుతుంటాయి. మరోవైపు రేఖ చుట్టూ ఎప్పుడూ దయ్యాలు తిరుగుతుంటాయి. పౌర్ణమి వచ్చిందంటే రేఖను వెతుక్కుంటూ ఓ రక్త పిశాచి వస్తుంటుంది. అస్సలు అలా ఎందుకు జరుగుతుంది..క్షుద్ర శక్తుల బారి నుంచి రేఖ ఎలా బయటపడింది.. అనేది ఈ మూవీ కథ.. థియేటర్స్ లో మెప్పించిన తంత్ర ఓటీటీ ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: