ఎన్టీఆర్ నెక్స్ట్ 3 మూవీలకు మ్యూజిక్ డైరెక్టర్స్ వీరే..!

Pulgam Srinivas
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వం లో రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ తో పాటు ఇప్పటికే బాలీవుడ్ సినిమా అయినటువంటి "వార్ 2" మూవీ ని కూడా ఎన్టీఆర్ ప్రారంభించాడు . ఈ రెండు మూవీ లతో పాటు మరి కొంత కాలం లోనే ఈయన ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందబోయే సినిమాలో హీరో గా నటించబోతున్నాడు.

ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇక పోతే ఈ మూడు మూవీ లు కూడా భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లు కావడం విశేషం. ఈ మూడు సినిమాలపై కూడా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దానితో ఈ సినిమాలను అత్యంత భారీ బడ్జెట్ తో మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూడు మూవీ లకు ఎవరు సంగీత దర్శకులుగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.

ఎన్టీఆర్ హీరో గా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాకు సన్షేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. ఈయన ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పాటలను కూడా రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే "వార్ 2" మూవీ కి ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే మరికొన్ని రోజుల్లో షూటింగ్ ప్రారంభం కానున్న ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ కి రవి బశ్రుర్ సంగీతం అందించబోతున్నాడు.

ఇకపోతే ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న మరియు మరి కొంత కాలంలో నటించబోయే సినిమాలకు సంగీతం అందిస్తున్న వారంతా ఇండియా వ్యాప్తంగా ఫుల్ క్రేజ్ కలిగిన సంగీత దర్శకులు కావడంతో ఈ మూడు సినిమాల ఆల్బమ్ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: