శ్రీకాంత్,వేణు కాంబినేషన్ లో వచ్చిన పెళ్ళాం ఊరెళితే
సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికి తెలిసిందే.ఈ మూవీలో
సునీల్ భార్య పాత్రలో అమాయకంగా తన
భర్త ఏం చేసినా కరెక్ట్ అనే పాత్రలో నటించిన నటి గుర్తుందా? ఆ నటి పేరు
ప్రశాంతి హారతి. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ నేర్చుకున్న
ప్రశాంతి, క్లాసికల్ డ్యాన్స్ ఫోటోషూట్స్ కి వెళ్లడంతో అలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి.
ఫిబ్రవరి 14 నెక్టెస్ రోడ్, రూపాయి,
ఇంద్ర ఇంకా పెళ్ళాం ఊరెళితే.. లాంటి సినిమాలతో మెప్పించింది. అంతేగాక పలు సీరియల్స్ లో కూడా నటించింది. ఇక క్లాసికల్ డ్యాన్సర్ గా ఎన్నో పర్ఫార్మెన్స్ లు చేసి ఆకట్టుకున్నారు.అయితే
ప్రశాంతి హారతి పెళ్ళాం ఊరెళితే
సినిమా తర్వాత పలు అవకాశాలు వచ్చినా ఇంట్లో వాళ్ళ కోరిక మేరకు
పెళ్లి చేసుకొని అమెరికాకి వెళ్ళిపోయారు. అయితే ఆమె
అమెరికా వెళ్లినా కూడా సినిమాలు చేయట్లేదని బాధపడేది. అయితే తన
భర్త సపోర్ట్ చేయడంతో అక్కడే అమెరికాలో
కూచిపూడి డ్యాన్స్
స్కూల్ ఒకటి పెట్టి అమెరికాలోని పిల్లలకు
కూచిపూడి డ్యాన్స్ నేర్పిస్తుంది. ఇన్నాళ్ల నుంచి అమెరికాలోనే ఉన్న
ప్రశాంతి ఇప్పుడు తన పిల్లలు పెద్దవాళ్ళు అవడంతో మళ్ళీ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇద్దామనుకున్నారు.ఈ నేపథ్యంలో
ప్రశాంతి హారతి
హైదరాబాద్ కి తిరిగి వచ్చారు.ప్రస్తుతం ఆమె పలు
యూట్యూబ్ ఛానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తుంది. తాజాగా మీడియాతో మాట్లాడుతూ
ప్రశాంతి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
ప్రశాంతి హారతి మాట్లాడుతూ.. "నటిగా నా కెరీర్ లో చాలా పెద్ద విరామం వచ్చింది. ఇప్పటికీ కూడా యాక్టింగ్ మీద ప్యాషన్ తగ్గలేదు. అందుకే మళ్లీ
టాలీవుడ్ కు నేను తిరిగివచ్చాను. ఇన్ని సంవత్సరాలు అమెరికాలో పిల్లలకు
కూచిపూడి నేర్పిస్తున్నాను. నేను యాక్టింగ్ కోర్సులు కూడా నేర్చుకోలేదు. కేవలం క్లాసికల్ డ్యాన్స్ నుంచే సినిమాల వైపుకి వెళ్ళాను. ఇప్పుడు సినిమాలు, ఓటీటీ,
యూట్యూబ్, సీరియల్స్ ఇంకా వెబ్ సిరీస్ లు అని చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రేక్షకులు గుర్తుపెట్టుకునే క్యారెక్టర్స్ వస్తే చేయడానికి రెడీగా ఉన్నాను. మళ్ళీ నా నటన ఏంటో చూపిస్తాను.
టాలీవుడ్ లో మంచి ఆఫర్స్ వస్తే బిజీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాను" అని అన్నారు.అలాగే.. మా పాప కూడా నా వద్దనే
కూచిపూడి నేర్చుకుంది. ఇటీవలే మా పాప తాన్యతో VN
ఆదిత్య దర్శకత్వంలో తెలుగింటి
సంస్కృతి అనే ఓ మ్యూజిక్ ఆడీయోని చేసాము. తన వయసుకు తగ్గట్టు సినిమాల్లో మంచి అవకాశం వస్తే తనని కూడా సినీ పరిశ్రమకు పరిచయం చేస్తానని తెలిపారు
ప్రశాంతి హారతి.