కుర్చీ మడతబెట్టి పాటకు ఊరమాస్ స్టెప్పులు వేసిన శివ కార్తికేయన్, శ్రీలీల...!!

murali krishna
'గుంటూరు కారం' రిజల్ట్ సంగతి పక్కన పెడితే 'కుర్చీ మడతపెట్టి' సాంగ్ క్రియేట్ చేసిన యుఫోరియా అంతా ఇంతా కాదు. ఈ పాట రిలీజైనప్పుడు ఎంతెంత నెగెటీవిటీ మూటగట్టుకుందో.ఆ తర్వాత ఇదే పాట ఓ రేంజ్ లో ట్రెండ్ అయింది. రీల్స్, యూట్యూబ్ షార్ట్స్ లలో మార్మోగిపోయింది. స్మాల్ స్క్రీన్ సెలబ్రెటీల నుంచి సిల్వర్ స్క్రీన్ ఆర్టిస్టుల వరకు కుర్చీ మడతపెట్టి హూక్ స్టెప్ వేశారు. థమన్ స్వర పరిచిన ఈ పాట మాములుగా ఊపలేదు. థియేటర్ లో ఈ పాటకు ఈలలు, గోలలతో ప్రేక్షకులు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కాగా తాజాగా ఇదే పాటకు శివ కార్తికేయన్ తో కలిసి శ్రీలీల మాస్ స్టెప్పులేసింది..టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శ్రీ లీల కలిసి నటించిన గుంటూరు కారం సినిమా ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇక ఈ సినిమా ఎంత హిట్ అయిందో అంతకంటే ముందు పాటలు బాగా హిట్ అయ్యాయి. గుంటూరు కారం సినిమాలోని కుర్చీ మడతబెట్టి సాంగ్ అయితే బాగా వైరల్ అయింది. ఈ పాట యూట్యూబ్లో సెన్సేషన్ ను క్రియేట్ చేసింది.యూట్యూబ్ లో మాత్రమే కాకుండా  ఇంస్టాగ్రామ్ ఎక్కడ చూసినా కూడా కొద్ది రోజులు ఈ పాట మారు మోగిపోయింది.  కుర్చీ మడతబెట్టి అనే ఒక వైరల్ పదం తీసుకొని దాంతో స్పెషల్ సాంగ్ రాయగా  ఇచ్చిన ఫాస్ట్ మ్యూజిక్ బీట్స్, శ్రీలీల, మహేష్ సినిమాలో వేసిన స్టెప్పులకు థియేటర్స్ దద్ద రిల్లాయి. థియేటర్స్ లో మహేష్, శ్రీలీల మాస్ స్టెప్పులు చూసి అభిమానులు, ప్రేక్షకులు ఆశ్చర్యపోయారు. ఆ స్టెప్పులు కూడా వైరల్ అవ్వడంతో బయట, ఈవెంట్స్ లో, కాలేజీ ఫంక్షన్స్ లో, రీల్స్ లో ఎక్కడ చూసినా కుర్చీ మడతబెట్టి స్టెప్పులు సందడి చేసాయి. ఇది ఇలా ఉంటే ఈ కుర్చీ మడత పెట్టి అనే సాంగ్ కి ఇప్పటికే బాలీవుడ్ సెలబ్రిటీలు టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది స్టెప్పులు వేసిన విషయం తెలిసిందే.  తాజాగా కుర్చీ మడతబెట్టి సాంగ్ కి శ్రీలీల, తమిళ్ స్టార్ హీరో శివ కార్తికేయన్క లిసి స్టేజిపై స్టెప్పులు వేయడంతో ఆ వీడియోలు వైరల్ గా మారాయి.తమిళనాడు తిరుచిరప్పల్లికి దగ్గర్లోని ధనలక్ష్మి శ్రీనివాసన్ యూనివర్సిటీలో జరిగే అనంతర కల్చరల్ ఫెస్ట్ కి ఆదివారం మార్చ్ 23 రాత్రి శివకార్తికేయన్, శ్రీలీల హాజరయ్యారు. ఈ ఈవెంట్లో శ్రీలీల, శివకార్తికేయన్ కలిసి స్టేజిమీద కుర్చీ మడతబెట్టి సాంగ్ కి స్టెప్పులు వేశారు. అక్కడి స్టూడెంట్స్ కూడా ఫుల్ జోష్ లో ఈ సాంగ్ కి డ్యాన్స్ వేశారు. దీంతో ఈ వీడియోలు వైరల్ గా మారాయి. ఇక శ్రీలీల, శివకార్తికేయన్ రావడంతో అక్కడి స్టూడెంట్స్ ఫోటోల కోసం ఎగబడ్డారు. స్టేజిపై శ్రీలీల, శివకార్తికేయన్, యాంకర్స్ కలిసి సెల్ఫీ కూడా తీసుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: