"దేవర" లో ఎన్టీఆర్ ఏకంగా అన్ని పాత్రలలో కనిపించనున్నాడా..?

Pulgam Srinivas
తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటు వంటి ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమా లో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ కి టాలీవుడ్ టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు . గతంలో ఎన్టీఆర్ , కొరటాల శివ కాంబో లో జనతా గ్యారేజ్ అనే మూవీ రూపొందింది. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో విరి కాంబో కి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. ఇకపోతే ఇప్పటికే ఎన్టీఆర్ , కొరటాల కాంబోలో రూపొందిన జనతా గ్యారేజ్ మూవీ మంచి విజయం సాధించడంతో దేవర మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో ఎన్టీఆర్ ద్వి పాత్రాభినయం చేస్తున్నట్లు ఒక పాత్రలో తండ్రి గాను ... మరొక పాత్రలో కొడుకు గానూ ఎన్టీఆర్ కనిపించబోతున్నట్లు చాలా రోజులుగా ఓ వార్త వైరల్ అవుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే సడన్ గా ఈ మూవీ కి సంబంధించి ఎన్టీఆర్ పాత్ర పై మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఇన్ని రోజుల పాటు ఈ సినిమాలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నట్లు వచ్చిన వార్తలు అన్నీ అవాస్తవం అని ఈ మూవీ లో ఎన్టీఆర్ ఏకంగా త్రి పాత్రబినయంలో కనిపించబోతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ లో మొదటి హీరోయిన్ గా జాన్వీ కపూర్ కనిపించనుండగా ... రెండవ హీరోయిన్గా శృతి మరాఠీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: