రెండుసార్లు చిరంజీవి ఆఫర్ ను రిజెక్ట్ చేశా... పృథ్వీరాజ్ సుకుమారన్..!

Pulgam Srinivas
మలయాళ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన నటు లలో ఒకరు అయినటువంటి పృథ్వీ రాజ్ సుకుమారన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు . ఈయన తాజాగా ప్రభాస్ హీరో గా ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో రూపొందిన సలార్ మూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించాడు . ఈ మూవీ ద్వారా ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు ది గొట్ లైఫ్ ఆడు జీవితం అనే సినిమాలో ప్రధాన పాత్రలో నటించాడు. ఈ సినిమా మరికొన్ని రోజుల్లోనే విడుదల కాబోతోంది.

ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈయన ఈ సినిమా ప్రమోషన్ లలో భాగంగా అనేక ప్రాంతాలను పర్యటిస్తూ వస్తున్నాడు. అందులో భాగంగా తాజాగా ఈయన ఈ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ కి వచ్చాడు. అందులో భాగంగా ఈయన కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశాడు. తాజాగా పృథ్వీరాజ్ మాట్లాడుతూ ... నేను టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగాస్టార్ చిరంజీవి ఆఫర్ లను రెండు సార్లు రిజెక్ట్ చేశాను. మొదటగా చిరంజీవి గారు నన్ను సైరా నరసింహా రెడ్డి సినిమాలో ఓ పాత్ర చేయమని అడిగాడు.

అప్పుడు నేను ఆయన ఆఫర్ ను రిజెక్ట్ చేశాను. ఆ తర్వాత గాడ్ ఫాదర్ మూవీ ని డైరెక్ట్ చేయమని నన్ను అడిగాడు. కానీ ఆ సమయంలో కూడా చిరంజీవి ఆఫర్ ను నేను రిజెక్ట్ చేశాను. నేను ఆడు జీవితం సినిమాతో చాలా బిజీగా ఉండడం వల్ల చిరంజీవి ఆఫర్ ను రెండు సార్లు రిజెక్ట్ చేశాను. ఆయన ఆఫర్ ను రిజెక్ట్ చేసినందుకు చిరంజీవి గారికి స్వారీ చెబుతున్నాను అని పృథ్వీరాజ్ తాజాగా చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

prs

సంబంధిత వార్తలు: