యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ ఆఖరుగా
రాజమౌళి దర్శకత్వం లో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" అనే సినిమాలో
హీరో గా నటించాడు . ఈ
మూవీ భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి ప్రపంచ వ్యాప్తంగా 1200 కోట్లకు పైగా కలెక్షన్ లను కొల్ల గొట్టి భారీ విజయాన్ని అందుకుంది . ఈ
మూవీ కి
ఆస్కార్ అవార్డు కూడా దక్కింది. ఇలా ఈ
సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే ఇంపాక్ట్ ను క్రియేట్ చేయడం తో ఈ
మూవీ ద్వారా
ఎన్టీఆర్ కి గ్లోబల్ గా క్రేజ్ లభించింది. ఇకపోతే ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును ఏర్పరచుకున్న ఈయన ప్రస్తుతం
కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ పాన్
ఇండియా మూవీ లో
హీరో గా నటిస్తున్నాడు.
ఈ సినిమాలో
బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటి అయినటువంటి జాన్వీ కపూర్
హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ
మూవీ లో
సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ కొడుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఈ
మూవీ లో
బాలీవుడ్ బ్యూటీ
జాన్వి కపూర్ మెయిన్
హీరోయిన్ గా కనిపించనుండగా ... ఈ
మూవీ లో రెండవ
హీరోయిన్ గా
శృతి మరాఠీ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈమెపై కొన్ని సన్నివేశాలను కూడా ఈ చిత్ర బృందం చిత్రీకరించినట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ
మూవీ లో
శృతి మరాఠీ పెద్ద
ఎన్టీఆర్ కు
భార్య పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.