"ప్రేమలు" మూవీకి ఆరు వారాల్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
పెద్దగా అంచనాలు లేకుండా మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర విడుదల అయ్యి సంచలనాలను సృష్టించిన ప్రేమలు సినిమా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ మూవీ యూత్ ఫుల్ లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొంది పెద్దగా అంచనాలు లేకుండా కొన్ని రోజుల క్రితం మలయాళం లో మొదట విడుదల అయ్యింది. ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి కలెక్షన్ లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. దానితో ఈ మూవీ అద్భుతమైన బ్లాక్ బాస్టర్ విజయాన్ని మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర సాధించింది. ఇకపోతే ఇప్పటి వరకు ఈ సినిమా 6 వారాలు అనగా 42 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. ఈ ఆరు వారాల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్ లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

ఈ మూవీ కి 42 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి కేరళ లో 58.05 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 8.76 కోట్ల కలెక్షన్ పను వసూలు చేయగా ... రెస్ట్ ఆఫ్ ఇండియాలో 11.05 కోట్లు , ఓవర్ సీస్ లో 41.40 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 53.65 కోట్ల షేర్ ... 119.26 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా ఇప్పటికే ఈ సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: