"ఆడు జీవితం" ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ఈరోజు ఆ సమయానికి..!

Pulgam Srinivas
మలయాళ సినీ పరిశ్రమలో నటుడిగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో పృథ్వీరాజ్ సుకుమారన్ ఒకరు. ఈయన పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి సలార్ సినిమాలో ఒ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఈ నటుడికి ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ లభించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ నటుడు "ది గోట్ లైఫ్" ఆడు జీవితం అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ కి బ్లెస్సీ దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
 

ఈ మూవీ మార్చి 28 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ లను ఫుల్ జోష్ లో నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఈ మూవీ బృందం వారు హైదరాబాదు లో ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించబోతుంది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ బృందం విడుదల చేసింది.

అసలు విషయం లోకి వెళితే ... ది గోట్ లైఫ్ ఆడు జీవితం మూవీ యూనిట్ ఈ రోజు అనగా మార్చి 22 వ తేదీన మధ్యాహ్నం రెండు గంటలకు బంజారాహిల్స్ లోని ఆర్ కే సినీ ప్లెక్స్ లో  ఈ మూవీ కి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ బృందం తాజాగా విడుదల చేసిన ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇ ల్కపోతే ఈ మూవీ పై మలయాళ సినీ ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ  స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

ps

సంబంధిత వార్తలు: