కవలపిల్లలకు జన్మనివ్వబోతున్న అమలాపాల్...!!!

murali krishna
సౌత్ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా పలు సినిమాలలో నటించి మంచి సక్సెస్ అందుకున్నటువంటి వారిలో అమలాపాల్  ఒకరు. ఈమె హీరోయిన్గా పలు సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు.తెలుగు తమిళ మలయాళ భాష చిత్రాలలో నటించి మెప్పించినటువంటి ఈమె తమిళ దర్శకుడిని పెళ్లి చేసుకున్నారు. అయితే తనతో వచ్చిన మనస్పర్ధలు కారణంగా విడాకులు తీసుకొని విడిపోయారు. ఇలా విడాకులు తీసుకున్నటువంటి ఈమె జగత్ దేశాయ్  అనే వ్యక్తితో ప్రేమలో పడ్డారు.ఇలా ప్రేమలో ఉన్నటువంటి ఈ జంట తమ ప్రేమ విషయాన్ని తెలియజేయడమే కాకుండా వెంటనే పెళ్లి చేసుకొని అందరికీ గుడ్ న్యూస్ తెలిపారు. అయితే పెళ్లి అయిన వెంటనే ఈమె బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ తాను ప్రెగ్నెం అనే విషయాన్ని వెల్లడించడంతో ఒకసారిగా ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.అయితే ఈమె పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అని ప్రెగ్నెంట్ కావడంతోనే వెంటనే పెళ్లి కూడా చేసుకున్నారంటూ ఎన్నో వార్తలు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉన్నటువంటి ఈమె తరచూ తన బేబీ బంప్ ఫోటోలను షేర్ చేస్తూ సందడి చేస్తుంటారు.  ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి పోస్ట్ చూస్తే కనుక ఈమెకు కవల పిల్లలు  జన్మించబోతున్నారా అన్న సందేహాలు వస్తున్నాయి. తాజాగా ఓ చిన్నారిని ఎత్తుకొని ఉన్నటువంటి ఫోటోలను అమలాపాల్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఈ ఫోటోలను షేర్ చేసినటువంటి ఈమె 2 హ్యాపీ కిడ్స్ అంటూ కామెంట్స్ చేశారు. ఇలా 2 కిడ్స్ అంటూ పోస్ట్ చేయడంతో బహుశా ఈమెకు కవలలు పుట్టబోతున్నారా అన్న సందేహాలు వ్యక్తమవగా, మరికొందరు ఆ చిన్నారితో పాటు తనని కూడా కిడ్ గా భావించి ఇలాంటి కామెంట్ చేసే ఉంటారు అంటూ మరికొందరు ఈ పోస్ట్ పై కామెంట్స్ చేస్తున్నారు.ఏడాది ప్రారంభంలోనే హీరోయిన్ అభిమానులకు గుడ్‌ న్యూస్ చెప్పింది. ఇటీవలే రెండో పెళ్లి చేసుకున్న ముద్దుగుమ్మ తాజాగా గర్భం ధరించినట్లు వెల్లడించింది.కాగా.. గతేడాది జూన్‌ నుంచే డేటింగ్‌లో ఉన్న అమలాపాల్‌ నవంబర్‌లో జగత్‌ దేశాయ్‌ను పెళ్లి చేసుకుంది. పెళ్లైన రెండు నెలలకే జనవరి 3న ప్రెగ్నెన్సీ ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ప్రస్తుతం బ్లెస్సీ దర్శకత్వంలో పృథ్వీరాజ్ సుకుమారన్ జంటగా ఆడుజీవితంలో అమలాపాల్ కనిపించనుంది. ఆ తర్వాత ద్విజ అనే మరో మలయాళ చిత్రంలో నటిస్తోంది. కాగా.. టాలీవుడ్‌లో అల్లు అర్జున్‌కు జంటగా ఇద్దరమ్మాయిలతో సినిమాలో మెప్పించింది. గతంలో మలయాళ డైరెక్టర్‌ విజయ్‌ను పెళ్లాడిన భామ.. ఆ తర్వాత మనస్పర్థలతో విడిపోయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: