"వేదా" మూవీ టీజర్ ను రిలీజ్ చేసిన మేకర్స్...!!
త్వరలో ‘వేదా‘ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యం లో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం లో. అద్భుతమైన యాక్టింగ్ తో జాన్ అబ్రహాం, శార్వరీ ఆకట్టుకుంటున్నారు. ఈ చిత్రంలో జాన్ అబ్రహాం శార్వరికి గురువుగా నటిస్తున్నారు.ఇక ఈ సినిమా లో స్టార్ హీరోయిన తమన్నా భాటియా స్పెషల్ రోల్ పోషిస్తోంది. ఇప్పటికే సినిమాలు, ఓటీటీల తో ఫుల్ బిజీ గా వున్న తమన్నా ఈ చిత్రంలో అమాయకురాలిగా కనిపించబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతోంది. గత ఏడాది తమన్నా నటించిన ‘లస్ట్ స్టోరీస్ 2’, ‘జీ కర్దా’ మంచి విజయం సాధించాయి. ఈ సినిమాలో ఓవైపు అమాయకురాలిగా కనిపిస్తూనే హై యాక్షన్ సన్నివేశాల్లో నటిస్తోంది.. ఈ చిత్రాన్ని వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కించినట్లు ఇప్పటికే దర్శకుడు నిఖిల్ వెల్లడించారు. సమాజంలోని పరిస్థితులను ప్రతిబింబించేలా ఈ చిత్రం ఉండబోతుందని తెలిపారు... ఈ సినిమా లో స్పెషల్ రోల్ చేయాలని నేను తమన్నాను అడిగినప్పుడు వెంటనే ఓకే చెప్పింది. ఈ సినిమా లో ఆమె పాత్ర అద్భుతంగా ఉండబోతోంది” అని వెల్లడించారు.