మహానటిలో సావిత్రి పాత్రకు కీర్తి రాంగ్ ఛాయిస్.. అవసరాల శ్రీనివాస్ కామెంట్స్ వైరల్?

praveen
అలనాటి మహానటి సావిత్రి జీవిత కథ ఆధారంగా ప్రేక్షకులు ముందుకు వచ్చిన మహానటి సినిమా ఎంత బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నాగ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో అటు సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటించింది. జెమినీ గణేషన్ పాత్రలో దుల్కర్ సల్మాన్ నటించాడు అన్న విషయం తెలిసిందే. మరికొన్ని కీలక పాత్రల్లో అటు సమంత, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ నటించారు అని చెప్పాలి. అయితే సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ సరిగ్గా సరిపోతుందా లేదా అని అందరూ సినిమా విడుదలవ్వకు ముందు వరకు అనుకున్నారు. కానీ విడుదలైన తర్వాత నిజంగా తెరమీద మళ్ళీ సావిత్రి నే చూసామేము అనే భావన ప్రతి ఒక్కరికి కలిగింది.

 ఎందుకంటే కట్టు బొట్టులోనే కాదు నటలోనూ అటు కీర్తి సురేష్ అలనాటి మహానటి సావిత్రిని మరిపించింది అని చెప్పాలి. మళ్లీ ఆ సావిత్రమ్మ పైనుండి దిగివచ్చి మహానటి సినిమాలో నటించిందేమో అనేంతలా కీర్తి సురేష్ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధులను   చేసేసింది. ఇక నేటి తరం సినీ ప్రేక్షకులకు  కొత్త సావిత్రంగా మారిపోయింది అని చెప్పాలి. అయితే కీర్తి సురేష్ ని సినిమాలో చూసిన తర్వాత నాగ్ అశ్విన్ విజన్ అద్భుతం. సావిత్రమ్మ పాత్రలో కీర్తి  సరిగ్గా సరిపోతుందని భలే ఊహించాడు అంటూ అందరూ ప్రశంసలు కురిపించారు. కీర్తి తప్ప మరొకరు ఆ పాత్రను అంత అద్భుతంగా పోషించలేరు అని ఎంతో మంది క్రిటిక్స్ కూడా ప్రశంసలు కురిపించారు.

 అయితే రచయిత, నటుడు అవసరాల శ్రీనివాస్ మాత్రం అటు కీర్తి సురేష్ ను మహానటి సినిమాలో సావిత్రి పాత్ర కోసం రాంగ్ ఛాయిస్ అనుకున్నారట. ఇక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగ అశ్విన్ దర్శకత్వంలో మహానటి సినిమాలో నేను ఎల్బీ శ్రీరామ్ పాత్రలో నటించాను. ఇక అశ్విన్ అడగడంతో కాదనలేక వెంటనే ఓకే చెప్పేసాను. అయితే సావిత్రి గారి పాత్రలో ఎవరు నటిస్తున్నారని అడిగాను. కీర్తి సురేష్ అని అశ్విన్ సమాధానం చెప్పాడు. కీర్తి పేరు వినగానే రాంగ్ ఛాయిస్ అని అనుకున్నాను. ఎందుకంటే ఆమె ఎక్కువగా కమర్షియల్ సినిమాలు చేస్తారు. అలాంటిది సావిత్రి గారి పాత్రలో నటించగలరా.. ఆమెలా హావ భావాలు పలకించగలరా అనుకున్నాను. కానీ సినిమా నుంచి కీర్తి సురేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో నేను తప్పుగా ఆలోచించాను అనిపించింది. కీర్తి సావిత్రి గారి పాత్రకు పర్ఫెక్ట్ ఛాయిస్ అని అర్థమైంది అంటూ చెప్పుకొచ్చాడు అవసరాల శ్రీనివాస్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: