5 సినిమాల్లో కలిసి నటించినా.. రవితేజ ఫేవరెట్ హీరోయిన్ ఇలియానా కాదట.. ఇంతకీ ఎవరంటే?

praveen
ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి స్టార్లుగా ఎదిగిన వారిలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఒకప్పుడు సైడ్ క్యారెక్టర్లు వేస్తూ కెరియర్ కొనసాగించిన రవితేజ.. ఆ తర్వాత హీరోగా మారి ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు. ఇక తన సినిమాలతో మాస్ మహారాజా అనే గుర్తింపును కూడా సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ఇటీవల కాలంలో హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. నేటితరం హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు అని చెప్పాలి.

 కాగా ఇటీవల టైగర్ నాగేశ్వరరావు, ఈగల్ లాంటి సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యాడు రవితేజ. అంతేకాదు ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా సినిమాలపై కూడా దృష్టి పెడుతున్నాడు అని చెప్పాలి. అయితే ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో రాబోయే మిస్టర్ బచ్చన్ అనే సినిమా తో బిజీ బిజీగా ఉన్నాడు.  సాధారణంగా ప్రేక్షకులు హీరో హీరోయిన్లను అభిమానించడం చేస్తూ ఉంటారు. అచ్చం ఇలాగే ఇక స్టార్లకు సైతం ఇలా ఫేవరెట్ హీరోలు హీరోయిన్లు ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు రవితేజ. ఆ ఇంటర్వ్యూలో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే ప్రశ్న రవితేజకు ఎదురయింది.

 రవితేజతో కలిసి నటించిన అనుష్క, ఇలియానా, త్రిష, శ్రీయ వీరిలో ఫేవరెట్ హీరోయిన్ అంటూ ఆప్షన్స్ కూడా ఇచ్చింది యాంకర్. అయితే ఇక ప్రశ్నకు రవితేజ సమాధానం చెబుతూ.. అనుష్క అంటే ఇష్టం అంటూ తెలిపాడు. ఆమె యాక్టింగ్ అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. కాగా అనుష్క రవితేజ బ్లాక్ బస్టర్ మూవీ అయినా విక్రమార్కుడులో కలిసి నటించారు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఇక రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటిగా కొనసాగుతుంది. ఇలియానాతో కిక్ 1,2 దేవుడు చేసిన మనుషులు, ఖతర్నాక్, అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాతో పాటు త్రిషతో కృష్ణ సినిమా చేసాడు. ఇక శ్రీయతో డాన్ శీను మూవీలో నటించాడు రవితేజ.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: