తెలుగు ,
తమిళ పరిశ్రమలలో తెలుగు లేని స్థాయి క్రేజ్ ను సంపాదించుకున్న నటిమని
సమంత గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈమె అద్భుతమైన క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటూ ఫుల్
జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న సమయం లోనే మయోసైటిస్ అనే వ్యాధి బారిన పడిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఈమె అందరికీ తెలియజేసింది.
ఇకపోతే తాజాగా
సమంత ఓ ఇంటర్వ్యూ లో పాల్గొంది. ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈమె తనకు వచ్చిన వ్యాధి గురించి బహిరంగంగా అందరికీ చెప్పడానికి గల కారణాలను వివరించింది. తాజా ఇంటర్వ్యూ లో భాగంగా
సమంత మాట్లాడుతూ ... నాకు మయోసైటిస్ అనే వ్యాధి వచ్చిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఆ విషయాన్ని నేనే బహిరంగంగా అందరికీ చెప్పాను. నాకు వచ్చిన వ్యాధి గురించి నేను అంత ఓపెన్ గా ప్రజలకు చెప్పడానికి ప్రధాన కారణం ... నేను ఆ సమయం లో ఓ సినిమాలో నటించాను. నాకు హెల్త్ ప్రాబ్లం ఉండడంతో ఆ
సినిమా ప్రమోషన్ లలో పాల్గొనలేకపోయాను.
జనాలు నేను
సినిమా ప్రమోషన్ లలో ఎందుకు పాల్గొనలేక పోతున్నాను అనే విషయం పై వారికి అనేక ప్రశ్నలు తలెత్తే అవకాశం ఉంది. దానితో నాకు ఉన్న సమస్యను బహిరంగంగా జనాలకు చెప్పాను అని
సమంత తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చింది. ఇకపోతే ఈ నటి ఆఖరుగా
టాలీవుడ్ యువ నటుడు
విజయ్ దేవరకొండ హీరో గా
శివ నర్వనా దర్శకత్వంలో రూపొందిన
ఖుషి అనే
లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్
మూవీ లో
హీరోయిన్ గా నటించింది. ఈ
మూవీ పాన్
ఇండియా మూవీ గా తెలుగు ,
తమిళ ,
కన్నడ , మలయాళ ,
హిందీ భాషలలో విడుదల అయింది.