11 రోజుల్లో "ప్రేమలు" మూవీకి తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ ఇవే..!

Pulgam Srinivas
కొన్ని రోజుల క్రితం ప్రేమలు అనే సినిమా మలయాళం లో విడుదల అయిన విషయం మన అందరికీ తెలిసిందే. పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా మలయాళం లో విడుదల అయిన ఈ మూవీ అక్కడ అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకొని బారి కలెక్షన్ లను వసులు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇలా ఈ సినిమా మలయాళ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించడంతో ఈ సినిమాను ఎస్ ఎస్ కార్తికేయ తెలుగు లో కూడా విడుదల చేశాడు. ఇకపోతే ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుండి కూడా మంచి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమా తెలుగు వర్షన్ కి 11 రోజుల్లో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్ లు దక్కాయి అనే విషయాలను క్లియర్ గా తెలుసుకుందాం.
ఈ మూవీ కి 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి నైజాం ఏరియాలో 2.38 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... ఆంధ్రప్రదేశ్ లో 1.95 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11 రోజుల్లో 4.33 కోట్ల షేర్ ... 7.62 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ 1.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇప్పటికే ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని 3.58 లక్షల లాభాలను అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల పాటు కూడా ఈ సినిమా తెలుగు వర్షన్ కు మంచి కలెక్షన్ లు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: