ఐకాన్ స్టార్
అల్లు అర్జున్ హీరో గా
రష్మిక మందన
హీరోయిన్ గా
సుకుమార్ దర్శకత్వంలో కొంత కాలం క్రితం "పుష్ప పార్ట్ 1" అనే
మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. మైత్రి సంస్థ వారు నిర్మించిన ఈ
మూవీ కి దేవి
శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ...
సమంత ఈ సినిమాలో ఓ ఐటమ్ సాంగ్ లో నటించింది. పహద్ ఫాజిల్ విలన్ పాత్రలో నటించిన ఈ సినిమాలో
అనసూయ ,
సునీల్ ,
రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. భారీ అంచనాల నడుమ పాన్
ఇండియా మూవీ గా విడుదల అయిన ఈ
సినిమా అద్భుతమైన విజయాన్ని
ఇండియా వ్యాప్తంగా అందుకుంది.
ఇకపోతే ఈ
మూవీ లోని నటనకు గాను
అల్లు అర్జున్ కు నేషనల్ అవార్డ్ కూడా దక్కింది. ఈ
మూవీ మొదటి భాగం సూపర్
సక్సెస్ కావడంతో ఈ
సినిమా రెండవ భాగం పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఇలా భారీ అంచనాలు కలిగి ఉన్న ఈ
సినిమా యొక్క షూటింగ్ ను ప్రస్తుతం ఈ
మూవీ బృందం ఫుల్ స్పీడ్ గా పూర్తి చేస్తూ వస్తుంది. ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ
మూవీ మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
ఈ
సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్న ఇప్పటి వరకు ఈ
మూవీ నుండి ఒక్క పాటను కూడా ఈ చిత్ర బృందం విడుదల చేయలేదు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సంవత్సరం ఏప్రిల్ 8 వ తేదీన
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ
మూవీ లోని మొదటి పాటను ఈ
మూవీ యూనిట్ విడుదల చేసే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ
మూవీ యూనిట్ ఈ సంవత్సరం
అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ
సినిమా నుండి మొదటి పాటను విడుదల చేస్తుందో లేదో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.