నాచురల్ స్టార్
నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలతో ఫుల్
జోష్ లో తన కెరీర్ ను ముందుకు సాగిస్తున్నాడు. పోయిన సంవత్సరం
నాని ,
శ్రీకాంత్ ఓదెలా అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందిన
దసరా అనే పాన్
ఇండియా సినిమాలో
హీరో గా నటించాడు. ఇదే
నాని కి మొట్ట మొదటి పాన్
ఇండియా మూవీ. ఇకపోతే భారీ అంచనాలు నడుమ విడుదల అయిన ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్
సక్సెస్ ను అందుకుంది. ఆ తర్వాత
నాని "హాయ్ నాన్న" అనే సినిమాలో
హీరో గా నటించాడు. శౌర్యవ్ దర్శకత్వంలో రూపొందిన ఈ
సినిమా కూడా తెలుగు ,
తమిళ ,
కన్నడ ,
హిందీ భాషలలో పాన్
ఇండియా మూవీ గా విడుదల అయ్యి మంచి విజయం సాధించింది.
ఈ
మూవీ తో
నాని క్రేజ్
ఇండియా వ్యాప్తంగా బాగా పెరిగింది. ఇకపోతే ప్రస్తుతం
నాని ,
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో
హీరో గా నటిస్తున్నాడు.
ప్రియాంక అరుల్
మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ కే
సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమాను ఈ సంవత్సరం ఆగస్టు నెలలో విడుదల చేయనున్నారు. ఈ
మూవీ నుండి కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఓ చిన్న వీడియోను విడుదల చేయగా అది అద్భుతంగా ఉండడంతో ఈ
మూవీ పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.
ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ
మూవీ కి దాదాపుగా 100 కోట్లకు మించి ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేళ నిజం గానే ఈ సినిమాకు గనుక 100 కోట్లకు మించి ప్రి రిలీజ్ బిజినెస్ జరిగినట్లు అయితే
నాని కెరియర్ లోనే ఈ
సినిమా హైయెస్ట్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుపుకున్న సినిమాగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ సినిమాకు ఏ రేంజ్ ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.