టాలీవుడ్ స్టార్ హీరో జనసేనాని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'గబ్బర్ సింగ్' వంటి ఆల్ టైం బ్లాక్ బస్టర్ తర్వాత 'ఉస్తాద్ భగత్ సింగ్' అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే.‘మైత్రి మూవీ మేకర్స్’ సంస్థ పై వై.రవి శంకర్, నవీన్ ఎర్నేని ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.కొంత భాగం ఈ సినిమా షూటింగ్ కూడా జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం కావడం, పవన్ కళ్యాణ్ తన జనసేన పార్టీ తరపున ప్రచారంలో ఉండటంతో ఈ సినిమా షూటింగ్ ఇంకా డిలే అవుతూ వస్తోంది.ఈ గ్యాప్లో హరీష్ శంకర్ ‘మిస్టర్ బచ్చన్’ అనే మూవీని తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమా కోసం పనిచేస్తూనే మరోపక్క ‘ఉస్తాద్..’ ప్రాజెక్టు పై కూడా ఇతను స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు సమాచారం తెలుస్తుంది. అసలు విషయం ఏమిటంటే.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడుగా పని చేస్తున్నాడు.
ఆల్రెడీ ఈ సినిమా కోసం కొన్ని ట్యూన్స్ ను కూడా హరీష్ శంకర్ ఫైనల్ చేయడం జరిగింది. అయితే అందులో ఒక థీమ్ సాంగ్ కూడా ఉంటుందట.‘ఉస్తాద్ భగత్ సింగ్’ అభిమానుల కోసం ఆ థీమ్ సాంగ్ ని త్వరలో విడుదల చేయడానికి కూడా చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. అంతకంటే ముందు ఎల్లుండి ఈ మూవీ నుంచి పవన్ కళ్యాణ్ మాటలతో కూడిన పొలిటికల్ వాయిస్ టీజర్ విడుదల కాబోతుందట.హరీష్ శంకర్- దేవి శ్రీ ప్రసాద్..ల కాంబినేషన్ లో వచ్చిన సినిమాలు మ్యూజికల్ హిట్స్ అనిపించుకున్నాయి. ‘గబ్బర్ సింగ్’ , ‘డీజె’ వంటి సినిమాల్లో పాటలన్నీ కూడా చార్ట్ బస్టర్స్ అయ్యాయి. ఇప్పుడు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా కూడా అభిమానుల అంచనాలు రీచ్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. మరి ఈ సినిమా వాటి లాగే పెద్ద హిట్ అయ్యి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగరాస్తుందో లేదో చూడాలి. ప్రస్తుతం ఎన్నికల్లో పవన్ బిజీగా ఉన్నాడు. ఎన్నికలు తరువాత మళ్ళీ సినిమాల్లో ఫుల్ బిజీ కానున్నాడు. పెండింగ్ లో ఉన్న OG, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలని కంప్లీట్ చెయ్యనున్నాడు.