నందమూరి నట సింహం
బాలకృష్ణ ,
టాలీవుడ్ మాస్ దర్శకుడు
బోయపాటి శ్రీను కాంబినేషన్ లో కొంత కాలం క్రితం అఖండ అనే
సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఫాంటసీ , యాక్షన్ ప్లస్ ఎమోషనల్ ఎంటర్టైనర్
మూవీ గా రూపొందిన ఈ
సినిమా భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి
బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇకపోతే ఈ సినిమాలో
బాలకృష్ణ అఘోరా గాను , రైతుగాను రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలలో నటించి ప్రేక్షకులను తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు.
ఇకపోతే ఈ సినిమాలో మోస్ట్
బ్యూటిఫుల్ నటిమని
ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా ... ఎస్ ఎస్
తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.
శ్రీకాంత్ ఈ
మూవీ లో విలన్ పాత్రలో నటించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమాకు కొనసాగింపుగా "అఖండ 2"
మూవీ ఉండబోతుంది అని ఇది వరకే ఈ
సినిమా దర్శకుడు
బోయపాటి శ్రీను ... అలాగే ఈ
మూవీ హీరో
బాలకృష్ణ పలుమార్లు చెప్పుకు వచ్చారు. ఇకపోతే ఇప్పటికే
బోయపాటి శ్రీను ఈ సినిమాకు సంబంధించిన కథ పనులను కూడా ముగించినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాకు సంబంధించిన కొన్ని పనులను మరికొన్ని రోజుల్లో
బోయపాటి శ్రీను పూర్తి చేసుకుని
నవంబర్ నెలలో "అఖండ 2" సినిమాని సెట్స్ పైకి తీసుకువెళ్లాలి అనే ఆలోచనలో ఈ
మాస్ దర్శకుడు ఉన్నట్లు ... అలాగే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా మరో కొన్ని రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ
మూవీ ఏ బ్యానర్ లో రూపొందిపోతుంది అనే విషయంపై మాత్రం పెద్దగా క్లారిటీ లేదు.